Biggboss Season8 : ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీళ్ళే!

Biggboss Season8 : ఫైనల్ గా బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ వస్తున్న మొదటి సీజన్ నుండి ప్రతి సారి సరికొత్తగా ఎంటర్టైన్ చేస్తూ ఉండగా, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యాక టిఆర్పి రేటింగ్ లు కూడా సినిమాల రేంజ్ లో వస్తూ ఉంటాయి. ఇక మొదట హిందీలో ఈ సీజన్ స్టార్ట్ అవగా, తెలుగులో 2017 లో మొదలై సక్సెస్ ఫుల్ గా 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్‌, ఎంటర్టైన్మెంట్ తో పాటు కాంట్రవర్సీస్‌ లతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇక నెల రోజుల ముందు నుండే బిగ్ బాస్ సీజన్ 8 (Biggboss Season8) రాబోతుందని, ప్రోమోలతో ప్రచారం చేసారు మేకర్స్. కమెడియన్ సత్యతో కలిసి నాగార్జునతో కలిసి ప్రోమోలు వదిలారు.

లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్స్..

ఇక సత్య ఉన్న బిగ్ బాస్ ప్రోమోలో ఈసారి లిమిట్ లెస్ అంటూ నాగార్జున (Nagarjuna) ప్రోమోలో చెప్పడం జరిగింది. కంటెస్టెంట్స్ కి లిమిట్ లెస్ టాస్క్ లు పెడుతూ, ఆడియన్స్ కి లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నాగార్జున చెప్పుకొచ్చారు. హౌస్ లోకి వెళ్లడానికి.. “ఒక్కసారి కమిట్ అయితే.. లిమిటే లేదు” అంటూ ప్రోమో ద్వారా తెలియచేసారు. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్లో పలువురు స్టార్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తారని వార్తలు రాగా, ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లో ఎవరెవరు అడుగుపెడుతున్నారో తెలిసిపోయింది.

List of 14 Contestants in Biggboss Season 8

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్ళే…

ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్లో కొంతమంది ఊహించిన వాళ్ళే ఎంట్రీ ఇవ్వగా, మరికొంత మంది జనాలకి పెద్దగా తెలియని వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ ఇలా ఉంది.

1. విష్ణు ప్రియ (యాంకర్, నటి) (Vishnu priya)
2. ఆదిత్య ఓం (నటుడు) (Aditya om)
3. అభయ్ నవీన్ (నటుడు) (Abhay naveen)
4. కిర్రాక్ సీత (నటి, 7ఆర్ట్స్ ఫేమ్) (Kirrak seetha)
5. యష్మి గౌడ (నటి, స్వాతి చినుకులు) (Yashmi gowda)
6. నిఖిల్ మలియక్కాల్ ( నటుడు, గోరింటాకు ఫేమ్) (Nikhil maiyakkal)
7. ప్రేరణ (నటి, కృష్ణ ముకుంద మురారి) (Prerana)
8. సోనియా (నటి) (Soniya)
9. శేఖర్ భాషా (RJ) (Sekhar basha)
10. నాగమణికంఠ (నటుడు) (Nagamanikantha)
11. పృథ్వీరాజ్ (నటుడు) (Prithwiraj)
12. నైనిక (డాన్సర్) (Nainika)
13. బెజవాడ బేబక్క (ఇన్ఫ్లుయెన్సర్) (Bejawada Bebakka)
14. నబీల్ ఆఫ్రిది (ఇన్ఫ్లుయెన్సర్) (Nabeel Afridi)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు