Bigg Boss 8 : యాక్టింగ్ పిచ్చి ఉన్న ‘నబీల్’.. ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదిగి.. సీజన్ 8 లో ఎంట్రీ ఇచ్చాడు..

Bigg Boss 8 : ఫైనల్ గా బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ వస్తున్న మొదటి సీజన్ నుండి ప్రతి సారి సరికొత్తగా ఎంటర్టైన్ చేస్తూ ఉండగా, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యాక టిఆర్పి రేటింగ్ లు కూడా సినిమాల రేంజ్ లో వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్‌, ఎంటర్టైన్మెంట్ తో పాటు కాంట్రవర్సీస్‌ లతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇక నెల రోజుల ముందునుండే బిగ్ బాస్ సీజన్ 8 (Biggboss Season8) రాబోతుందని, ప్రోమోలతో ప్రచారం చేసారు మేకర్స్. తాజాగా సెప్టెంబర్ 1నుండే బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్టింగ్ తో కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పెర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

YouTuber Nabeel Afridi entered in Bigg Boss season 8

14 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..

ఇక ఈ సీజన్లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ మొదలు కొని వరుసగా… నిఖిల్ మలియక్కల్, అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, ఇన్ఫ్లుయెన్సుర్ బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, యాంకర్ విష్ణుప్రియ, డ్యాన్సర్ నైనిక రాగా కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టగా, చివరగా పద్నాలుగో కంటెస్టెంట్ గా “నబిల్ ఆఫ్రిది” అనే కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. అయితే మిగతా అందరిలో ఎక్కువ మంది నటులుగా ఫేమస్ కాగా, ఓ ఇద్దరు రీసెంట్ గా పలు ఇన్సిడెంట్ల ద్వారా ఫేమస్ అయ్యారు. అయితే ఈ పద్నాలుగో కంటెస్టెంట్ నబీల్ గురించి ఎక్కువగా ఆడియన్స్ కి తెలియలేదు. కాని ఒక్కసారి బిగ్ బాస్ లోక్ ఎంట్రీ ఇచ్చాక ఎవరైనా ఫేమస్ అయిపోతారు. అలాగే ఇతని గురించి కూడా నెట్టింట అందరూ చర్చిస్తున్నారు.

- Advertisement -

యాక్టింగ్ పిచ్చితో యూట్యూబ్ స్టార్ గా నబీల్..

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పద్నాలుగో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నబీల్ ఆఫ్రిది ఒక ఫేమస్ యూట్యూబర్. వరంగల్ లో పుట్టి పెరిగిన నబీల్, యాక్టింగ్ పై పిచ్చితో చిన్నప్పుడే హైదరాబాద్ కి వచ్చి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసాడు. కొన్ని ర్యాప్ సాంగ్స్ కూడా చేసాడు. అయితే నబిల్ ఆఫ్రిది (Nabeel Afridi) యూట్యూబ్ లో “వరంగల్ డైరీస్” అనే యూట్యూబ్ ఛానల్ తో షార్ట్ ఫిల్మ్స్ వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ముందుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూసి, ఫైనల్ గా సొంతంగానే యూట్యూబ్ ఛానెల్ పెట్టి పాపులర్ అయ్యాడు. వరంగల్ నబీల్ గా తెలుగు రాష్ట్రాల జనాలకి పాపులర్ అయ్యాడు. మరి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన నబీల్ ఆఫ్రిది తన ఆటతీరుతో ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు