Chiranjeevi About Pawan Kalyan: ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి , ఎమోషనల్ అయిన మెగాస్టార్

Chiranjeevi About Pawan Kalyan: కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ పదిమందికి ఆదర్శంగా ఉంటాయి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు ఒక పదిమంది హీరోలను ఇండస్ట్రీకి అందించారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లో మెగాస్టార్ గా పేరుపొందిన తర్వాత రాజకీయాల్లో కూడా తన ముద్రను వేయాలని, రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. అయితే మొదట కొంతమంది ప్రజాననీకం మెగాస్టార్ చిరంజీవిని ఆదరించినా కూడా అప్పటి పరిస్థితులు బట్టి తన పార్టీని విలీనం చేయవలసి వచ్చింది. ఇక అప్పటినుంచి వ్యక్తిగతంగా చాలా విమర్శలను మెగాస్టార్ చిరంజీవి ఎదుర్కొన్నారు.

2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించారు. అయితే పార్టీని స్థాపించిన వెంటనే పోటీలో దిగకుండా అప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు. ఆ తర్వాత 2019లో రెండు చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా చాలామంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఒక పదేళ్లు సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పెను మార్పులు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గెలుపుతో చాలామంది మెగా అభిమానుల్లో ఆనందం ఉప్పొంగింది. ఇక నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక అన్నయ్యగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Chiranjeevi, Pawan Kalyan, Ram Charan

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

కళ్యాణ్ బాబు…
ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి
వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.

రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు.
అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది.
పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐❤️❤️
దీర్ఘాయుష్మాన్ భవ!

రామ్ చరణ్ తేజ్ ట్వీట్

మీ బలం, అంకితభావం మరియు అవసరంలో ఉన్నవారి పట్ల కనికరం ఎల్లప్పుడూ నాకు మరియు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి.
మీ నిస్వార్థ చర్యలు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించే ప్రజల అవసరాలను తీర్చడంలో అంకితభావంతో దృష్టి సారించడం మరియు ఆంధ్రప్రదేశ్‌లోని అణగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం అద్భుతమైన స్ఫూర్తిదాయకం!!
దేవుడు మీకు మార్గనిర్దేశం చేస్తూ, ఆశీర్వదిస్తూ, మీకు మరింత బలాన్ని ఇస్తూ ఉంటాడు.

అంటూ ఇద్దరు ట్వీట్స్ చేసారు. ఈ ట్వీట్లు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ పై తమ కుటుంబ సభ్యులకు ఎంతటి ప్రేమ, అభిమానాలు ఉన్నాయో అర్థమవుతుంది. అలానే ఆ గెలుపును ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు