Vijay : ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ లో సలార్ సినిమా చూసిన తమిళ్ స్టార్ హీరో

Vijay : చాలామంది స్టార్ హీరోలకు చాలా కోరికలు ఉంటాయి. కానీ వాళ్లకున్న సెలెబ్రెటీ స్టేటస్ వలన అవి తీర్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఒక సినిమాను ఎంతలా ఎంజాయ్ చేస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక రకమైన పండగ వాతావరణం ఉంటుంది. తెలుగు ప్రేక్షకులతో సినిమాలు చూడాలని చాలామంది స్టార్ హీరోలు సైతం కోరుకుంటారు. అయితే అది అంత ఈజీగా సాధ్యం కాదు. అని ఒక తమిళ స్టార్ హీరో తెలుగు ప్రేక్షకులతో ఒక మాస్ థియేటర్లో ఒక మాస్ సినిమాను చూశాడు.

ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో వచ్చిన సినిమా సలార్(Salar). ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. దీని కారణం ఇదివరకే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కే జి ఎఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించడమే. ఇక అటువంటి డైరెక్టర్ ఒక పాన్ ఇండియా హీరోతో సినిమాను చేస్తున్నాడు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాను మల్టీప్లెక్స్ లో కొంతమంది సెలబ్రిటీస్ చూసుంటారు. కానీ తమిళ స్టార్ హీరో విజయ్ ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ లో చాలామంది ప్రేక్షకులతో కలిసి చూశాడు.

Salaar

- Advertisement -

ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. వెంకట్ ప్రభు(Venkat Prabhu), వైభవ్(Vaibhav), విజయ్ వీళ్లంతా కలిసి హైదరాబాద్ లో ఉన్నప్పుడు సాయంత్రం సినిమాకి వెళ్దామా అని అనుకున్నారట. అయితే అప్పటికి విజయ్ పీవీఆర్ వంటి థియేటర్లో డంకి లాంటి సినిమా చూస్తారేమో అని అందరూ ఊహించారు. అప్పటికప్పుడు విజయ్ ఒక మాస్ థియేటర్లో కమర్షియల్ సినిమా చూద్దామంటూ గోకుల్ థియేటర్లో సాధారణమైన ప్రేక్షకులతో పాటు కలిసి సలార్ సినిమాని చూశాడు. అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వైభవ్ రివీల్ చేశాడు.

వైభవ్ రివీల్ చేసినప్పుడు కూడా ఈ విషయం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇది నిజమే అని తెలుస్తుంది. గోకుల్ థియేటర్లో విజయ్ బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చి మాస్క్ పెట్టుకొని ప్రభాస్ సలార్ సినిమాను చూశాడు. అయితే కొన్ని వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఆ వీడియోలు అప్పుడు ఎందుకు రివిల్ కాలేదు అంటే నాకు సెక్యూరిటీ లేదు మా ప్రైవేట్ అండ్ డిస్టర్బ్ చేయొద్దు అని విజయ్ అప్పుడు చెప్పాడట. ఇక ఏదేమైనా విజయ్ చేసిన క్రేజీ థింగ్ సాహసం అనే చెప్పాలి. కొంతమంది సోషల్ మీడియా వేదిక విజయ్ మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు