RT 75: విడుదల వాయిదా.. బెడ్ రెస్ట్ కే పరిమితం కానున్న రవితేజ.!

RT 75.. మహారాజా రవితేజ (Raviteja )హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే మిస్టర్ బచ్చన్(Mr .Bachchan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన పూర్తిగా డిజాస్టర్ ను చవి చూశారని చెప్పవచ్చు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. కానీ ఊహించని డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆచితూచి అడుగులు వేస్తున్నారు రవితేజ. అందులో భాగంగానే తన 75వ చిత్రాన్ని భాను భోగవరపు (Bhanu bhogavarapu) అనే ఒక కొత్త డైరెక్టర్ తో చేయబోతున్నారు.

RT 75: Release postponed.. Ravi Teja will be confined to bed rest.!
RT 75: Release postponed.. Ravi Teja will be confined to bed rest.!

ధమాకా కాంబో రిపీట్..

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే ధమాకా కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు శ్రీ లీలా కి మంచి పేరు లభించింది. అందుకే మళ్ళీ రవితేజతో జతకట్టడానికి సిద్ధమయింది ఈ ముద్దుగుమ్మ.

షూటింగ్లో గాయం.. ఆరు వారాలు బెడ్ రెస్ట్..

ఇదిలా ఉండగా ప్రస్తుతం RT 75 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. అయితే ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా రవితేజ గాయపడినట్లు సమాచారం. ఆయన కుడి చేతి కండరం చిట్లిపోయి గాయపడిందని చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఆ గాయాన్ని లెక్కచేయకుండా రవితేజ షూటింగ్ ను కొనసాగించారట. గాయం ప్రభావం ఎక్కువ అవడంతో.. గురువారం యశోద హాస్పిటల్ లో డాక్టర్లు రవితేజకు సర్జరీ నిర్వహించారని సమాచారం. ఇక గాయం నుంచి పూర్తిగా కోల్పోవడానికి 6 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. అందుకే అప్పటివరకు రవితేజ ఈ సినిమా షూటింగ్ కి దూరంగా ఉండనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

- Advertisement -

సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటున్న RT 75 ..

ఇక ఈ గాయం కారణంగా మరో ఆరు వారాలపాటు సినిమా షూటింగ్ వాయిదా పడబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ కి ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినిమా షూటింగ్ పూర్తి అవడానికి కూడా సమయం పడుతుంది. అందులో భాగంగానే ఈ సినిమా విడుదల తేదీని సంక్రాంతి బరి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. నిజానికి సంక్రాంతికి పెద్ద పెద్ద స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి. అలాంటి సినిమాల మధ్య రవితేజ హిట్ కొట్టడం సాధ్యమేనా అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయన చేతికి గాయం కూడా అయింది. ఇక సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి సంక్రాంతి రేస్ నుంచి రవితేజ 75వ చిత్రాన్ని తప్పించినట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ ఆరు వారాలపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు