Janaka Aithe Ganaka: తేడా కొడితే రిలీజ్ రోజు ఎవరూ రారు

Janaka Aithe Ganaka: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సుహాస్ ఒకడు. ఇప్పటివరకు సుహాస్ మొత్తం మూడు సినిమాలు చేశాడు. అయితే వాటిలో ఒక సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయింది. అదే కలర్ ఫోటో. ఆ సినిమాతోనే సుహాస్ మంచి పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత సుహాస్ చేసిన రెండవ సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను కూడా అందుకుంది.

ఇకపోతే సుహాస్ చేసిన మూడో సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా మంచి హిట్ అయిందని చెప్పవచ్చు. కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా ఈ సినిమాకి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం సుహాస్ చేస్తున్న సినిమా “జనక అయితే గనక” ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారం గా ప్రకటించింది.

Janaka Aithe Ganaka

- Advertisement -

ఈ సినిమా రిలీజ్ కి దగ్గరవుతున్న తరుణంలో ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఈ ప్రెస్ మీట్ కి దిల్ రాజు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ చేస్తారని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి దిల్ రాజు సమాధానం ఇస్తూ. ప్రీమియర్స్ అనేవి కొన్నిసార్లు ప్లస్ అవుతాయి కొన్నిసార్లు మైనస్ అవుతాయి. ప్రీమియర్ షో కి సంబంధించిన టాకు తేడా కొడితే ఆ సినిమాకి ఎవరూ రారు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అయితే ప్రీమియర్ షోస్ వలన హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. అని కూడా మరోసారి గుర్తు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు