OTT Movie : ఆ తప్పు చేసే టీనేజర్సే దెయ్యాల టార్గెట్… గుండె దడ పుట్టించే ఎక్స్పరిమెంటల్ హారర్ మూవీ

OTT Movie : హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. సౌత్ లో కూడా ఇలాంటి సినిమాలు ఎన్నో తెరకెక్కుతున్నప్పటికీ హాలీవుడ్ హారర్ సినిమాలకు ఉన్న ఫ్యాన్ బేస్ సపరేట్ అని చెప్పాలి. సాధారణ సినిమాల కంటే ఇలాంటి హారర్ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ థ్రిల్ ఫీల్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇలాంటి కిక్ కోసమే చాలామంది హారర్ మూవీస్ కి అడిక్ట్ అవుతారు. మీరు కూడా ఇలాంటి హారర్ మూవీ లవర్స్ అయితే ఈ మూవీ సజెషన్ కచ్చితంగా మీకోసమే. మరి ఈ సినిమా ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ హర్రర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే ఇది జస్ట్ హారర్ కంటెంట్ మాత్రమే కాదు ఎక్స్పరిమెంటల్ అని కూడా చెప్పొచ్చు. సాధారణంగా ఈ డిజిటల్ యుగంలో దయ్యాలు ఉన్నాయి అనే విషయాన్ని చాలా మంది నమ్మరు. కానీ సినిమాలో మాత్రం ఏకంగా ఓ ఆర్గనైజేషన్ రాక్షసుడిని నిద్ర లేపే పనికి పూనుకుంటుంది. పైగా టీనేజర్లను దానికి బలి ఇవ్వడం వంటివి చేస్తుంది.

สมาคมชม The Cabin in the Woods (สปอยล์เด้อ)

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇందులో ఆర్గనైజేషన్ పురాతన రాక్షసుడిని నిద్రలేపడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో పని చేసే ఇద్దరు వ్యక్తులు రాక్షసులు, దయ్యాలు వంటి భయంకరమైన వాటిని బంధించి, సాధారణ మానవులపై పరీక్షించడం వంటి పనిని చేస్తారు. ఇక రాక్షసుడు నిద్ర లేపడానికి టీనేజర్లను ట్రాప్ చేసి బలి ఇవ్వడం మొదలు పెడతారు. మరోవైపు ఐదుగురు ఫ్రెండ్స్ సరదాగా టూర్ వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. అయితే వీళ్లంతా కలిసి ఓ అడవిలో ఉండే క్యాబిన్ హౌస్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. కానీ వాళ్ళు చేసే అతి పెద్ద తప్పు అదే అవుతుంది. ఓవైపు వీళ్లంతా అక్కడికి చేరుకుని ఎంజాయ్ చేస్తుంటే, మరో వైపు ఆ ఆర్గనైజేషన్ కు సంబంధించిన వ్యక్తులు వీళ్ళని ఓ కంట గమనిస్తూ ఉంటారు. అంతేకాకుండా బేస్మెంట్లో వీళ్ళ కోసం వెయిట్ చేస్తారు. ఇవన్నీ తెలియని ఈ ఐదుగురు ఫ్రెండ్స్ టీం సరదాగా ఎంజాయ్ చేస్తుంది. ఓ వ్యక్తి అక్కడికి వెళ్ళద్దు అని ఎంత మొత్తుకున్నా అస్సలు వినరు. చివరికి ఆ క్యాబిన్ హౌస్ లోకి వెళ్లి అన్నింటిని పరీక్షిస్తుంటారు. అంతలోపే ఈ ఐదుగురు బేస్మెంట్ లో పడిపోతారు. ఇక ఆ తర్వాత స్టోరీ ఊహించని ఈ విధంగా ముందుకెళ్తుంది. అసలు ఈ ఎక్స్పరిమెంట్ ఏంటి? ఆర్గనైజేషన్ ఎందుకు ఈ పని చేస్తుంది? బేస్మెంట్ లో ఉండే ఆ దయ్యాలు వీళ్ళని ఏం చేశాయి? ఈ ఐదుగురిలో కనీసం ఒక్కరైనా బయటపడ్డారా లేదా? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న క్యాబిన్ ఇన్ ది వుడ్స్ అనే ఈ హారర్ సినిమాను వెంటనే చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు