OTT Movie : ప్రేమించిన అమ్మాయి చెంప పగలగొట్టిందా? అయితే ఈ రొమాంటిక్ మూవీని చూడాల్సిందే

OTT Movie : లవ్ స్టోరీలలో టీనేజ్ లవ్ స్టోరీలు వేరు. కొన్ని మనసుకు హత్తుకునే విధంగా ఉంటే, మరికొన్ని సోషల్ మెసేజ్ తో వారెవ్వా అనిపిస్తాయి. ఈరోజుల్లో టీనేజ్ పిల్లలు ఎంత సున్నితంగా ఉన్నారంటే ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన డెసిషన్ తీసుకుంటున్నారు. ఇక గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేసిందని, చెంప పగలగొట్టింది అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఎంతో మంది. అలా ఫీల్ అయ్యే వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

ఆహాలో స్ట్రిమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ ఓ తమిళ డబ్బింగ్ సినిమా. మే 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఆహాలో అందుబాటులోకి రాబోతోంది. బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇక ఈరోజె ఈ మూవీ ఆహా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయాన్ని వెల్లడించారు. తమిళంలో రంగోలి పేరుతో రిలీజ్ అయిన ఈ టీనేజ్ లవ్ స్టోరీ ని తెలుగు లో సత్య అనే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అమరేష్, మురగదాస్, సందీప్, ప్రార్థన, సాయి శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఫోటో జర్నలిస్ట్ శివ మల్లాల సత్య పేరుతో ఈ చిన్న సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో పెద్దగా ఆడలేదు గానీ తమిళంలో మాత్రం బాగానే ఆడింది. మరి ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Rangoli (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

- Advertisement -

స్టోరీ లోకి వెళ్తే…

ఇందులో హీరో పేరు సత్య. తనకు ఇష్టం లేకపోయినా తండ్రి కోసం ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదవడానికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక చదువు సంగతి ఎలా ఉన్నా పార్వతి అనే అమ్మాయిపై మనసు పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. కానీ ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వదు. అలాగే బయటకు చెప్పదు. ఇక ఓ రోజు అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య షాకింగ్ ఘటన జరుగుతుంది. హీరోయిన్ హీరోని ఏకంగా అందరి ముందు చంప దెబ్బ కొడుతుంది. దీంతో హీరో హర్ట్ అయ్యి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ కాలేజీని వదిలేసి తన ఫ్యామిలీ కోసం హీరో తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు హీరోయిన్ అతన్ని ఎందుకు కొట్టింది? ఈ ఇద్దరూ చివరికి కలిసారా లేదా? ఈ లవ్ స్టోరీకి ఎండ్ కార్డు ఎలా పడింది? అని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సత్యం మూవీని ఆహాలో చూడాల్సిందే. ఆల్రెడీ తమిళంలో ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ తెలుగులో మాత్రం సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా ఆహాలో అడుగు పెట్టబోతోంది. పండగ రోజు చక్కగా ఈ టీనేజ్ లవ్ స్టోరీపై ఫ్యామిలీతో కలిసి ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు