OTT Movie : లవ్ చేసిన పిల్ల వేరొకడిని పెళ్లాడితే ఇంత సైకోలా మారతారా? మోస్ట్ వయోలెంట్ మూవీ

OTT Movie : లవ్ అనేది మనిషిని ఎంత మాయ చేస్తుందో ఇప్పటిదాకా మనం ఎన్నో సినిమాల్లో చూశాము. కానీ కోరుకున్న అమ్మాయి మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది అని తెలిస్తే, ఆమెను దక్కించుకోవడానికి ఆ అబ్బాయి ఎంత సైకోలా మారతాడు అనే విషయాన్ని చూపించే సినిమాలు కూడా చాలానే వచ్చాయి. అయితే అర్జున్ రెడ్డి ముందు దాకా నచ్చిన అమ్మాయి దక్కకపోతే, ఒక వ్యక్తిలో కన్పించే రాక్షసత్వాన్ని విలన్ గా చూసాము మనం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా ఆ విలనిజం కాస్తా హిరోయిజం, హీరో ఎమోషన్ గా మారింది. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. ఇక ఇదొక మోస్ట్ వయోలెంట్ మూవీ అని చెప్పొచ్చు. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయంపై లుక్కేద్దాం పదండి.

ఫిలిం ఫెస్టివల్ లో ప్రశంసలు అందుకున్న మూవీ

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ గత ఏడాది టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. అలాగే ఈ ఏడాది జూన్లో జరిగిన మరో ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇలా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ఇంగ్లీష్ రీమేక్ రైట్స్ ను చార్లెస్ ఎఫ్ స్తాహెల్క్సీ సొంతం చేసుకున్నారు. ఒక భారతీయ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ ని హాలీవుడ్ మేకర్స్ ఇలా దక్కించుకోవడం ఇదే మొదటి సారేమో. ఇక నిఖిల్ నగేష్ బట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 5న థియేటర్లోకి వచ్చింది. బిగ్ స్క్రీన్ పై మంచి వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఇందులో ల‌క్ష్య హీరోగా నటించగా, తాన్య మనక్తీలా హీరోయిన్ పాత్రను పోషించింది. ప్రస్తుతం ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటిటితో సందడి చేయడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 6 నుంచి హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

KILL: Action-packed teaser unveils debutant Lakshya in gritty love story,  watch : Bollywood News - Bollywood Hungama

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

అమిత్ రాథోడ్ ఆర్మీలో కమాండర్ గా పని చేస్తూ ఉంటారు. అతను ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంటుంది. కానీ సడన్ గా తండ్రి కోసం ఆమె వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకోవడానికి రెడీ అవుతుంది. అయితే విషయం తెలుసుకున్న హీరో ఎంగేజ్మెంట్ ను ఆపేసి, ఆమెతో కలిసి పెళ్లి చేసుకోవడానికి ఢిల్లీకి ప్రయాణం అవుతాడు. ఈ ప్రయాణంలో ఆ రైలులో బందిపోట్లు ఎక్కడంతో స్టోరీ టర్న్ అవుతుంది. మరోవైపు హీరో గర్ల్ ఫ్రెండ్ ఫ్యామిలీ అనుకోని విధంగా ప్రమాదంలో పడుతుంది. మరి హీరో ఆ బందిపోట్లను ఎలా అడ్డుకున్నాడు? గర్ల్ ఫ్రెండ్ ను కాపాడుకోగలిగాడా లేదా ? అనే విషయాలు తెలియాలంటే ఇంటెన్స్ వయోలెంట్ యాక్షన్ డ్రామా కిల్ మూవీని చూడాల్సిందే. సినిమా మొత్తం యాక్షన్ సన్నివశాలతో అల్మోస్ట్ ట్రైన్ లోనే సాగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు