Bigg boss 8 : ఈ సీజన్లో కంటెస్టెంట్లకు నాగార్జున పెట్టిన మూడు రూల్స్ ఇవే!

Bigg Boss 8 : బుల్లితెర ప్రియులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎట్టకేలకు మళ్ళీ వచ్చేసింది. కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో ఫైనల్ గా సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైంది. ఇక మొదటి ఎపిసోడ్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా, ఇందులో పలు టీవీ సీరియల్స్ నటులు, సినిమా నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో… సీరియల్ నటి యష్మి గౌడ మొదలు కొని వరుసగా… నటుడు నిఖిల్ మలియక్కల్, నటుడు అభయ్ నవీన్, హీరో ఆదిత్య ఓం, నటి సోనియా ఆకుల, ఇన్ఫ్లుయెన్సుర్ బెజవాడ బేబక్క, నటి కిరాక్ సీత, నటుడు నాగ మణికంఠ, నటుడు పృథ్వీరాజ్ శెట్టి, యాంకర్ విష్ణుప్రియ, డ్యాన్సర్ నైనిక , యూట్యుబర్ నబిల్ ఆఫ్రిది, నటి ప్రేరణ, ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు.

Nagarjuna gave 3 rules to the contestants in Bigg Boss season 8

నాగార్జున పెట్టిన మూడు రూల్స్ ఇవే!

ఇదిలా ఉండగా హౌస్ (Bigg boss 8) లోకి అందరూ ఈసారి పెయిర్స్ గా అడుగుపెట్టారు. అలా మొత్తం 7 జంటలు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఈ హౌస్ లో నాగార్జున (Nagarjuna) హౌస్ మేట్స్ ని పంపడంతోనే గేమ్ స్టార్ట్ చేసారు. ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక, వాళ్ళ మధ్య గేమ్స్ పెట్టి మూడు బ్యాడ్ న్యూస్ లు చెప్పాడు. వాటినే బిగ్ బాస్ హౌస్ లో మూడు రూల్స్ గా పెట్టడం జరిగింది. ఇక ముందుగా నాగార్జున ఫస్ట్ రూల్ గా ఈ సీజన్‌కు కెప్టెన్ ఎవరూ ఉండరని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రెండో రూల్ గా ఈ సీజన్లో ఫ్రీ రేషన్ ఉండదని చెప్పడం జరిగింది. హౌస్ లో వాళ్ళకి కావాల్సిన రేషన్ టాస్క్ లు, గేమ్స్ లో గెలుచుకోవాలి అని కండిషన్ పెట్టడం జరిగింది. ఇక ఫైనల్ గా మూడో రూల్ ఈ సీజన్లో అసలు ప్రైజ్ మనీ డిసైడ్ చేయలేదని, జీరోగా పెట్టారని అంటూ… ప్రైజ్ మనీ అనేది వాళ్ళ ఆట తీరుని బట్టి పెరుగుతూ పోతుంది అని నాగార్జున చెప్పడం జరిగింది.

- Advertisement -

తొలిరోజే అలకలు, అపార్థాలు..

ఇక బిగ్ బాస్ (Biggboss 8) హౌస్ లోకి అడుగుపెట్టిన తొలిరోజే వీళ్ళలో ఎవరూ ఒకరికి ఒకరు సరిగా పరిచయం కూడా చేసుకోలేదు. అప్పుడే అలకలు, అపార్థాలు మొదలెట్టారు. సోనియా, బేబక్క, ఆర్జే శేఖర్, నాగ మణికంఠ, యష్మి గౌడ ఇలా అందరూ ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టు గొడవ స్టార్ట్ చేసారు. అయితే అందరూ ఒక్కరోజులోనే అర్ధం చేసుకోవడం కూడా జరగదు. మినిమం రెండు వారాలు ముగిస్తే గాని, ఒకరిపై ఒకరికి సరైన అవగాహన, అభిప్రాయం రాదనేది నెటిజన్ల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు