Vyjayanthi Movies : రేపటికోసం.. ప్రభుత్వానికి ‘కల్కి’ మేకర్స్ ఆర్ధిక సాయం..

Vyjayanthi Movies : టాలీవుడ్ లో విజయవంతమైన చిత్రాలు నిర్మించే బడా సంస్థల్లో ఒకటి “వైజయంతి మూవీస్” సంస్థ. అశ్వినీదత్ నిర్మాతగా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలు అందిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఆ మధ్య కాస్త చల్లబడ్డ మహానటి వంటి క్లాసిక్ చిత్రంతో మళ్ళీ ఊపందుకోగా, లేటెస్ట్ గా కల్కి2898AD సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ ని అందుకుని ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక ఇప్పుడు అశ్వినీదత్ వారసురాళ్లు కుమార్తెలు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్ తండ్రి తరపున నిర్మాణ బాధ్యతలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు.

Vyjayanthi Movies donates 25 lakhs to AP CM Relief Fund to help flood victims

తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తిన వరదలు..

ఇక అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారం రోజులుగా వరుణుడు రెండు రాష్ట్రాలపై భీభత్సం సృష్టిస్తుండగా, చెరువులు, నదులు పొంగి రాష్ట్రాల్లో వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. రోడ్లపై కూడా భారీగా నీరు చేరి చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇక కొన్ని చోట్ల వరదలు ముంచెత్తి ఊళ్లనే ముంచేసాయి. దీంతో జన జీవనం స్థంభించిపోయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం ముందస్తు రిస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను ఇతర ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో వరద భీభత్సం మరింత ఉదృతంగా ఉంది. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ నుండి కూడా సాయం అందుతుంది. ఇక వరద బాధితులకి పవన్ కళ్యాణ్ (Pawan kalyan), రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల అభిమానులు ఆహరం అందించడం వంటి సహాయాలు చేస్తున్నారు.

- Advertisement -

ప్రభుత్వానికి కల్కి మేకర్స్ సాయం.. రేపటికోసం

ఇక సినీ ఇండస్ట్రీ నుండి కూడా ప్రభుత్వానికి తక్షణ సాయం అందుతుండగా, రీసెంట్ గా ప్రభాస్ తో “కల్కి2898AD” (Kalki2898AD) నిర్మించి భారీ సక్సెస్ అందుకున్న నిర్మాణ సంస్థ వైజయంతి మూవీ ఆంధ్ర ప్రదేశ్ వరద బాధితులకు ముందుకొచ్చారు. తమ వంతు సాయంగా “ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్” (AP CM Relife fund) కి వరద బాధితుల కోసం ఆర్ధిక సాయాన్ని అందించారు. మొత్తంగా 25 లక్షల రూపాయలు వరద బాధితుల సహాయార్ధం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నామని, ఈ కష్ట కాలంలో ప్రజలకు అందరూ అండగా ఉండాలని, రేపటి కోసం అందర్నీ కాపాడాల్సి ఉందని వైజయంతి మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి భారీ విరాళాలు అందనున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు