Bigg Boss Telugu 8 Day 2 Promo: సోనియా మరో గీతూ కానుందా.. అందరితో విభేదాలైతే ఎలాగమ్మా..?

Bigg Boss Telugu 8 Day 2 Promo.. తెలుగు బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ 8 లోకి ఒక మోస్తారు గుర్తింపు ఉన్న సెలెబ్రెటీలు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెట్టి, ఎవరికీ వారు సత్తా చాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొదటి టాస్క్ లో ఇంటికి చీఫ్ గా ఎవరు ఉండబోతున్నారు అంటూ 14 మందికి పోటీలు నిర్వహించారు బిగ్ బాస్. అందులో భాగంగానే యష్మీ గౌడ , నిఖిల్, నైనిక టాస్క్ లో గెలిచి ఇంటికి చీఫ్ గా ముగ్గురు ఎన్నికయ్యారు.

Bigg Boss Telugu 8 Day 2 Promo: Will Sonia be another Geetu.. What if she disagrees with everyone..
Bigg Boss Telugu 8 Day 2 Promo: Will Sonia be another Geetu.. What if she disagrees with everyone..

గీతూ స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్న సోనియా..

ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు కూడా వీరు తీసుకోవాల్సి ఉంటుంది. వీరు జడ్జిలుగా మొదటి వారం నామినేషన్ లో భాగంగా నిలిచారు. ఇకపోతే సోమవారం అనగానే నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగానే సోమవారం జరిగిన నామినేషన్స్ కి సంబంధించి తాజాగా బిగ్ బాస్ నిర్వహకులు ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఎవరికి వారు మేమే గొప్ప అనే రేంజ్ లో గొడవలు పడుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గీతూ రాయల్ ఎలాగైతే తన స్ట్రాటజీ తో ముందుకు వెళ్ళిందో, ఇప్పుడు ఎనిమిదవ సీజన్లో కూడా సోనియా కూడా అలాగే ముందుకు వెళుతోందని చెప్పవచ్చు.

అసలు నామినేషన్ షురూ..

ఇక తాజాగా ప్రోమో విడుదల చేయగా ప్రోమో విషయానికి వస్తే.. ఇంటి సభ్యులుగా ఎన్నికైన యష్మీ గౌడ , నిఖిల్, నైనికాలను ప్రశంసించిన బిగ్ బాస్, ఆ తర్వాత అక్కడ ఉన్న పూలమాలులను స్వయంగా ధరించి వారికి కేటాయించిన స్థానాలలో కూర్చోమని చెబుతారు . ఆ తర్వాత అసలు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక ప్రెషర్ కుక్కర్లో అన్నం సరిగ్గా ఉడకలేదంటూ బేబక్కను టార్గెట్ చేసింది సోనియా. కుక్కర్లో అన్నం సరిగా ఉడకకపోతే తప్పు నాదా , కుక్కర్ చెడిపోతే అందులో నా తప్పేముంది అంటూ బేబక్క చెబుతుంది. ఇక మధ్యలో బేబక్క తన మాటలు ఫినిష్ చేయకుండానే సోనియా నోరు పారేసుకోవడం మనం చూడవచ్చు.

- Advertisement -

బిగ్ బాస్ ఇంటికి మరో ఫైర్ బ్రాండ్..

అక్కడితో ఆగకుండా ప్రేరణపై కూడా కామెంట్లు చేస్తూ రెచ్చిపోయింది సోనియా. ఇద్దరూ కాసేపు గొడవపడ్డారు కూడా. మధ్యలో జడ్జిలు కలగచేసుకున్నా వీరు వినలేదు. ఇక దీన్ని బట్టి చూస్తే సోనియా అందరిలో అటెన్షన్ క్రియేట్ చేయడానికి గతంలో గీతూ రాయల్ లాగా ఇప్పుడు రెచ్చిపోతోందని తెలుస్తోంది. నిన్నటికి నిన్న యష్మి గౌడతో గొడవపడ్డ సోనియా, ఇప్పుడు ప్రేరణ బేబక్కలతో కూడా గొడవ పెట్టుకుంది ఇలా రోజుకొక కంటెస్టెంట్ తో గొడవపడితే ఎలా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండగా..మరికొంతమంది బిగ్ బాస్ ఇంటికి మరో ఫైర్ బ్రాండ్ దొరికిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు