Tollywood Actor : హీరోలకు తల్లిగా చేస్తున్న ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే నోర్లు వెళ్లబెట్టాల్సిందే..!

Tollywood Actor : ఇటీవల సోషల్ మీడియాలో సెలెబ్రేటీల చిన్నప్పటి ఫోటోలు మాత్రమే కాదు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న వారి గురించి కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ వచ్చింది. ఈ మధ్య హీరోలకు తల్లిగా నటిస్తుంది. లేటు వయసులో యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు హీరో హీరోయిన్లకు మదర్‌గా చేస్తోంది. ఆమె ఎవరంటే కళ్యాణి నటరాజన్ (Kalyani Natarajan ). నటనకు వయస్సు అడ్డుకాదని నిరూపిస్తున్న ఈ నటీమణి గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆమె బ్యాగ్రౌండ్ గురించి వివరంగా తెలుసుకుందాం..

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు కళ్యాణి నటరాజన్.. ఈమె ఒక తమిలియన్. కానీ చిన్నప్పటి నుంచే ముంబై లో స్థిరపడ్డారు. ఇంగ్లిష్ బాష పై ప్రత్యేక డిగ్రీని పొందిన ఆమె మొదట స్కూల్ పిల్లలకు టీచర్ గా చేసేందుకు ట్రైనింగ్ తీసుకుంది. కొద్ది రోజులు టీచర్ గా పనిచేసిన ఈమె ఆ తర్వాత నటన పై ఆసక్తి ఉండటంతో అటువైపు అడుగులు వేసింది. చిన్న చిన్న నాటకాలు చేస్తూ సినిమాల్లో అవకాశాలను పొందింది. ట్రావెట్ కన్సల్టెంట్‌గా వర్క్ చేసింది. బాలకృష్ణన్ నటరాజన్‌ ( Blakrishna Natarajan ) ను వివాహం చేసుకున్నాక.. ఉద్యోగం, పిల్లలు అంటూ గడిపేసింది. కానీ ఆమెకు యాక్టింగ్ అంటే ఇష్టం. థియేటర్ ట్రైనింగ్ ఆర్టిస్ట్ గా ట్రైనింగ్ తీసుకున్న ఈమె మొదట వరుసగా నాటకాలను చేసింది.

Do you know the background of her who is the mother of the heroes?
Do you know the background of her who is the mother of the heroes?

అలా మొదటగా ఓ జ్యువెలరీ యాడ్ చేసే అవకాశం వచ్చింది. ఇక 2013లో సెట్టై తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది గోరీ తేరే ప్యార్ మే అనే చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అప్పటి నుండి వరుసగా తమిళ చిత్రాలు చేసి సక్సెస్ అయ్యింది కళ్యాణి. ఇక తెలుగులో బాలకృష్ణ ( Blakrishna ) డిక్టేటర్ మూవీతో తెరంగేట్రం ఇచ్చింది. ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత మహానుభావుడు సినిమాలో శర్వానంద్ తల్లిగా నటించింది. ఈమె హీరోల మదర్‌గా నటిస్తూ మెప్పిస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళంలోనూ నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇప్పటివరకు తెలుగులో గీతా గోవిందం, శైలజా రెడ్డి అల్లుడు, పడి పడి లేచే మనసు, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అలా వైకుంఠపురం, భీష్మ, వరుడు కావలెను, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేరు వీరయ్య, అమిగోస్, రావణాసుర, రంగబలి, సిద్దార్థ్ రాయ్, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తన భర్తతో కలిసి పలు వ్యాపారాలు కూడా చేస్తుందని టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు