Megha Akash: శ్రీలంకలో టాలీవుడ్ హీరోయిన్ బ్యాచిలర్ పార్టీ…?

 

Megha Akash: టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood) ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మేఘా ఆకాష్ (Megha Akash) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత మరోసారి నితిన్ సరసన చల్ మోహనరంగ చిత్రంలో నటించింది. ఈ సినిమాల అనంతరం మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో తమిళంలో సినిమాలు చేసింది. అక్కడ ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా….. ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మేఘా ఆకాష్ (Megha Akash) సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాయివిష్ణు అనే వ్యక్తితో ఈ బ్యూటీ వివాహం చేసుకోనుంది. గత ఆరేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్ కొనసాగిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.

- Advertisement -

இலங்கையில் 'பேச்சுலர் பார்ட்டி' கொண்டாடிய மேகா ஆகாஷ்.. ஒரே ஆட்டம், பாட்டம்,  கொண்டாட்டம் தான்.. பார்ட்டி வைப் கிளிக்ஸ்! | Megha Akash Bachelor Party  Photos ...
ఇక వీరి ఎంగేజ్మెంట్ కు సినీ ప్రముఖులు ఎవ్వరిని కూడా ఆహ్వానించలేదు. అందరినీ వివాహానికే పిలిచిందని సమాచారం. మేఘా ఆకాష్ ఈ సంవత్సరం చివర్లో వివాహం చేసుకోనుంది. దీంతో తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీని ఘనంగా జరుపుకుంటుంది. ఈ పార్టీ కోసం తన స్నేహితులతో కలిసి మేఘా ఆకాష్ (Megha Akash) శ్రీలంకకు (Sri lanka) వెళ్ళింది. శ్రీలంకలో తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు చూసిన చాలామంది మేఘా ఆకాష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి వివాహం అయిన తర్వాత మేఘా ఆకాష్ సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు