Vyjayanthi Movies : కుల పిచ్చితో పాటు ఈ పిచ్చి కూడా ఉందా..? సాయంలో పార్సియాలిటీ ఎందుకు అండి..?

Vyjayanthi Movies : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో అశ్విని దత్(Ashwani Dutt) ఒకరు. వైజయంతి బ్యానర్ పైన అశ్విని దత్ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఇకపోతే రీసెంట్గా ఈ సంస్థ నుంచి కల్కి(Kalki) అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా దాదాపు 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇకపోతే వైజయంతి బ్యానర్ అశ్విని దత్ కి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఎన్నో సినిమాలకు చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్ గా కూడా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర 175 డేస్ సినిమా ఫంక్షన్ కూడా నారా చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరయ్యారు.

ఇకపోతే చాలా కథనాల్లో అశ్విని దత్ కి కులపిచ్చి ఉంది అని వార్తలు వినిపిస్తుంటాయి. అలానే ఆ సినిమా బ్యానర్ కూడా ఎన్టీఆర్ లోగో తోనే స్టార్ట్ అవుతుంది. పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేసిన తీరు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇకపోతే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో వరదలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా పరిస్థితులు అతలాకుతలం అయిపోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 25 లక్షలు విరాళాల అందించారు అశ్విని దత్. దీంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కేవలం కుల పిచ్చి మాత్రమే కాకుండా ప్రాంతీయ పిచ్చి కూడా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు.

Producer Ashwini Dutt

- Advertisement -

TSA స్టేట్ ప్రెసిడెంట్ యన్. యం. శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ

గడిచిన కొన్ని రోజులుగా భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతుంది ఖమ్మం లో మరియు కోదాడ లో దాదాపుగా 16 మంది చనిపోయారు వరద భీభత్సానికిచాలామంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు దాదాపుగా లక్ష ఎకరాల్లో పంట నష్టం అయింది ప్రధాన రహదారుల్లో రాకపోకలు స్థంభించాయి ప్రజలు నిరాశ్రయులై రోడ్డున పడ్డారు ఈ వరదల పట్ల సినిమా ఇండస్ట్రీ తెలంగాణ పై చూపుతున్న వివక్షత క్షమించరానిది వైజయంతి మూవీస్ సంస్థ 25 లక్షలు ఆంధ్ర CM సహాయనిదికి ఇచ్చినట్లు ప్రకటించింది వారికి ఇవ్వడాన్ని మేము తప్పు పట్టడం లేదు కానీ తెలంగాణ వరదల పట్ల మీ వైఖరీ ఏమిటి, తెలంగాణ సంపదను కొల్లగొట్టి, స్టూడియోల పేరుతో ఆంధ్రపెత్తందారులు ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు లీజుకి తీసుకుని లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ఇది చాలదు అన్నట్లుగా అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారు .

కొంతమంది సినీ పరిశ్రమ వాళ్లు ప్రజలు ఆదుకోవడానికి AP సిఎం సహాయ నిధి కి డబ్బులు ఇస్తున్నారు సంతోషం. గతంలో కూడ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ కి కోట్ల రూపాయలు ఇచ్చారు కానీ హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కనీసం ఎవరు స్పందించలేదు..తెలంగాణ సంపద కొల్లగొట్టి లక్షల కోట్లు సంపాదిస్తారు కానీ విపత్తు కాలంలో తెలంగాణకు మాత్రం సహాయం చేయరు? అందుకే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. సినీ ఇండస్ట్రీ స్పందించి తెలంగాణ వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయాలి వైజయంతి మూవీస్ కి 24 గంటలు టైమ్ ఇస్తున్నాము వారు స్పందించి వివక్షత చూపినoదుకు క్షమాపణలు చెప్పి తెలంగాణ కి ఆర్థిక సహాయం చేయాలి. లేకపోతే వైజయంతి మూవీస్ ఆఫీసు ముట్టడి చేస్తాము.అదే విధంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు స్పందించి ఆర్థిక సహాయం చేయాలి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ పై వివక్షత చూపరాదు ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించాలి లేనిచో అన్ని స్టూడియోలను ముట్టడిస్తాం. అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు