Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకత స్టార్ట్ అయిందా..? మిస్సింగ్ అంటూ ట్రోల్స్..

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో విపరీతమైన గుర్తింపును సాధించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక కీలక పదవిలో ఉన్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి సుదీర్ఘమైన పదేళ్ల ప్రయాణం తర్వాత పదవిలో కూర్చున్నారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక రకమైన విషయాల్లో అడుగులు వేస్తూ రాజకీయంగా కూడా సక్సెస్ సాధిస్తున్నారు అని చెప్పాలి. రాజకీయాల్లోకి రాకముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విపరీతంగా విరాళాలు ఇస్తూ తన వ్యక్తిత్వాన్ని చాటుకునేవాళ్ళు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే చాలా మంది రైతులకు సహాయార్థం నిలబడ్డారు. ఎన్నో సమస్యలు తరపున పోరాడారు. అందుకే కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. వైయస్సార్సీపి టార్గెట్ చేసినా కూడా పవన్ ఏనాడు వెన్ను చూపించలేదు. ఇక రాజకీయాల్లో గెలుపు ఓటమి లు ఎలా అయితే సహజంగా ఉంటాయో, అలానే ఒక నాయకుడిని తిట్టే వాళ్ళు పొగిడే వాళ్ళు ఉండటం అనేది కామన్ గా జరుగుతుంది. ఇప్పటివరకు సినిమాలు పరంగా కొంతమంది పవన్ కళ్యాణ్ను ట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ట్రోల్స్ మొదలవుతున్నాయి.

Pawan Kalyan

- Advertisement -

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని వివరించాల్సిన అవసరం లేదు. విజయవాడ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా మారింది. బస్సులు కదలని పరిస్థితి. సామాన్య ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ చూస్తూనే ఉన్నాను. ఈ తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బోట్లపై కూడా వెళ్లి సందర్శిస్తూ ప్రజలకు కావలసిన సహాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించడం లేదు. దీనితో మా డిప్యూటీ సీఎం కనిపించడం లేదు అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది సోషల్ మీడియా వేదిక డిప్యూటీ సీఎం కనిపించడం లేదు అంటూ ఫొటోస్ కూడా పెడుతున్నారు.

ఏ పదవి లేనప్పుడు బాధ్యతగా వ్యవహరించి అన్ని తానే చూసుకున్న పవన్ కళ్యాణ్ నేడు ఒక బాధ్యత చేపట్టి కూడా ఇంతవరకు మీడియాలో కనిపించకపోవడానికి కారణాలు ఏమిటి అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కనిపించలేదు అని అంటే బ్యాక్ అండ్ లో ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు అని కూడా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా కనిపించి, ప్రజల మధ్యకు వస్తే గాని ఈ ఆరోపణలకు బ్రేక్ పడదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు