Radhika: కమలహాసన్ గురించి విస్తుపోయే నిజం బయటపెట్టిన రాధిక..!

Radhika.. మలయాళ సినీ ఇండస్ట్రీలో జరిగే లైంగిక వేధింపులు , దాడుల గురించి హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత చాలామంది సీనియర్ స్టార్ హీరోయిన్లు తమ కెరియర్లో తాము ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి, ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇతర భాషా ఇండస్ట్రీలలో కూడా జరుగుతున్నాయని పలువురు హీరోయిన్లు చెబుతున్నారు. ఇతర సినిమా రంగాల్లో కూడా మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని అయినా సరే ఎవరు నోరు మెదపడం లేదని వాపోతున్నారు.

Radhika: Radhika reveals shocking truth about Kamal Haasan..!
Radhika: Radhika reveals shocking truth about Kamal Haasan..!

రహస్యంగా అమ్మాయిల వీడియోలు తీసి గుంపుగా చూస్తారు..

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చలామణి అవుతున్న సీరియల్ హీరోయిన్లలో ఒకరైన రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar)చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేశాయి. తను చాలా భాషా చిత్రాలలో నటించానని , అందుకే ప్రతి ఇండస్ట్రీలో కూడా ఏం జరుగుతుందో తనకు తెలుసు అని తెలిపారు. ముఖ్యంగా క్యారవాన్ లో రహస్య కెమెరాలు పెట్టి, మహిళలు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసి , ఆ తర్వాత కొంతమంది మగాళ్లు గుంపుగా ఆ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా చూసేటప్పుడు నేను చూశాను అంటూ రాధిక వెల్లడించింది. ఇక రాధిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దాదాపు కొన్నేళ్ళ క్రితం ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారడం, దీనికి తోడు ఒక సీనియర్ నటుడు తనను ఇబ్బంది పెట్టాడు అంటూ మరొకసారి కామెంట్లు చేయడంతో హాట్ టాపిక్ గా మారాయి.

కమలహాసన్ పై రాధిక షాకింగ్ కామెంట్స్..

ముద్దు సన్నివేశాలలో నటించి పేరు తెచ్చుకున్న ఒక నటుడు తనను, తన కోడల్ని ముద్దులు సన్నివేశంలో నటించమని బలవంతం చేశాడని , ఆయన ఎవరో కాదు యూనివర్సల్ హీరో కమలహాసన్ (Kamal Hassan) అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాధిక. కమల్ హాసన్ సినిమాలలో ఖచ్చితంగా ముద్దు సన్నివేశాలు ఉంటాయి. యువతను అట్రాక్ట్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఇలాంటి సన్నివేశాలను సినిమాలలో ఉంచడానికి ఆసక్తి చూపిస్తారు. ఒకప్పుడు కమలహాసన్ సినిమాలలో కూడా ఇలా ముద్దు సన్నివేశాలు ఉండాలని రూల్ కూడా ఉండేది. అందుకే కొంతమంది నటీమణులు ఇష్టం లేక ఆయన సినిమాలలో నటించేవారు కాదు. మరి కొంతమంది అభ్యంతరాలు లేకుండా ముద్దు సన్నివేశాలలో నటించేవారు. ఇలాంటి ముద్దు సన్నివేశాలలో నటించడం ఇష్టపడకపోవడం వల్లే సిప్పీండి ముత్ సినిమా తర్వాత ఆయన సినిమాలలో నటించడమే మానేశాను అంటూ తెలిపింది రాధిక.

- Advertisement -

ముద్దు సన్నివేశాలలో కమల్ హాసన్ అసభ్యకర ప్రవర్తన.

ముఖ్యంగా కమలహాసన్ ఎంత నీచుడు అంటే ఆయనతో ముద్దు సన్నివేశాలలో నటించేటప్పుడు పెదాలను నొక్కి మరీ ముద్దులు పెట్టేవాడు. నన్నే కాదు నా కోడల్ని కూడా ఇలాగే హింసించాడు. ఇక నేను దానిని వ్యతిరేకించినప్పుడు నాపై చాలామంది వ్యతిరేకత చూపారు. ఆ తర్వాత అవకాశాలు కూడా చేజారిపోయాయి అంటూ రాధిక తెలిపింది. ఇకపోతే కమలహాసన్ పై రాధికనే కాదు గతంలో హీరోయిన్ రేఖ కూడా ఇలాంటి ఫిర్యాదు చేసింది. సినిమాలో తనకు చెప్పకుండానే ముద్దు సన్నివేశాలు పెట్టారని, కమలహాసన్ తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని కూడా ఆమె తెలిపింది.. దీంతో ఇప్పుడు రాధిక చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా కమలహాసన్ లాంటి గొప్ప నటుడి పై ఇలాంటి ఆరోపణలు చాలా ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు