Star Heroine: కోలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. కమిటీ వేస్తే 500 మంది జైలు పాలు..!

Star Heroine.. మలయాళం సినీ ఇండస్ట్రీలో ఆడవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు అంటూ జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించగా.. అందులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఒక మలయాళ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో కూడా ముఖ్యంగా పని ప్రదేశాలలో ఆడవారు ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా బాధిత నటీమణులు మీడియా ముందుకు వచ్చి చెబుతున్న విషయం తెలిసిందే. ఇక మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని , హేమా కమిటీ లాంటి నివేదిక ఇక్కడ కూడా వేయాలి అంటూ స్టార్ హీరోలైన అనుష్క శెట్టి (Anushka Shetty), సమంత (Samantha) కూడా కోరడంతో ఒక్కసారిగా యావత్ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.

Star Heroine: Casting Couch in Kollywood.. 500 people will be jailed if the committee is formed..!
Star Heroine: Casting Couch in Kollywood.. 500 people will be jailed if the committee is formed..!

లైంగిక వేధింపులపై స్పందించిన నటి రేఖ నాయర్..

అయితే ఇప్పుడు మరొక నటి రేఖ నాయర్ (Rekha Nair) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు ఉన్నాయి. ఆ కాలంలో మీడియా డెవలప్మెంట్ లేకపోవడం వల్లే ఇండస్ట్రీలో చాలామంది సర్దుకుపోయేవారు. అదే సమయంలో ఆ అడ్జస్ట్మెంట్ కి తగ్గట్టు ఇమడలేక సినిమాల నుంచి తప్పకున్న వారు కూడా చాలామంది ఉన్నారు అంటూ ఆమె తెలిపింది. తమిళ సినిమాలో ఇలాంటి లైంగిక వేధింపులు లక్షల్లో ఉన్నాయి అంటూ తెలిపింది ఈ మలయాళ ముద్దుగుమ్మ.

నేను నోరు విప్పితే 500 మంది జైలు పాలు..

ఆమె మాట్లాడుతూ.. నేను కనుక దీని గురించి నోరు విప్పాను అంటే ఇక్కడ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వరు. అందుకే చాలామంది నటీమణులు కూడా దీని గురించి మాట్లాడటం లేదు అంటూ ఆమె తెలిపింది. ఇప్పుడు మలయాళంలో కనీసం 10 నుండి 20 వికెట్లు మాత్రమే పడతాయి. అదే తమిళ సినిమా లిస్టు తీస్తే దాదాపు 500 నుండి 600 వికెట్లు పడతాయి. అంతేకాదు వారంతా కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ ఆమె సంచలన కామెంట్లు చేసింది.

- Advertisement -

మాట్లాడితే కెరియర్ లేకుండా చేస్తారు..

ముఖ్యంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాగా ప్రతిభ ఉన్నవారికి గౌరవం లేదు. ముఖ్యంగా అత్యంత ప్రతిభావంతులు నటించే వారి కంటే, చెప్పిన పని చేసే వారికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఒక నటి దాని గురించి మాట్లాడితే ఇతర మగనటుల వేధింపులకు గురైన వారు కూడా బయటికి వస్తారు. అయితే అలా మాట్లాడేవారు లేరు. ఎందుకంటే అలా మాట్లాడితే ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా పోతాయి. ఫలితంగా కెరియర్ నాశనం అవుతుంది అని చాలామంది ఆలోచించి వెనకడుగు వేస్తున్నారు ఆమె తెలిపింది. ఇప్పటికే ఒక మలయాళం నటి కెరియర్లో పీక్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ వేధింపులు భరించలేక ఇక్కడి నుంచి పారిపోయింది. ఇక ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే పరిస్థితుల్లో తమిళ్ సినీ సంఘాలు లేవని నా అభిప్రాయం. ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఎవరూ ఉండరు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా ఇలా చేసే వారిని చెప్పుతో కొట్టమని చెప్పారు కానీ నేను అతను చెప్పడం కంటే ముందే కొట్టేశాననీ తెలిపింది… కానీ మీరు బాధితులను ఎలా చిత్రీకరిస్తారు..? ఎక్కడ దాచారు అని ప్రశ్నించాను. ముఖ్యంగా ఒక మలయాళం లోనే కాదు అన్ని భాషల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం నటి రేఖా నాయర్ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు