Bigg Boss 8 : క్రేజీ బజ్… హౌజ్ లోకి నాగ చైతన్య, శోభిత ఎంట్రీ?

Bigg Boss 8 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 టెలికాస్ట్ మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్ తో హోస్ట్ నాగార్జున సెప్టెంబర్ 1న గ్రాండ్ గా షోను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే షో ఆసక్తికరంగా నడుస్తోంది. కంటెస్టెంట్స్ మొదటి రోజు నుంచే రచ్చ మొదలు పెట్టారు. ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టుగా నడుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. లవ్ బర్డ్స్ నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అన్నది ఆ రూమర్ల సారాంశం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుంది? అనే విషయంలోకి వెళ్తే….

హౌస్ లోకి చై, శోభిత ఎంట్రీ…

సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఈమె అంటూ పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో శోబిత ధూళిపాళ్ల కూడా ఒకరు. అయితే ఆ రూమర్లనే నిజం చేస్తూ రీసెంట్ గా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని అందరిని షాక్ అయ్యేలా చేశారు. అయితే వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేయడం తప్ప బయట ఎక్కడ కలిసి కనిపించలేదు. చాలాకాలం డేటింగ్ లో ఉన్నప్పటికీ ఈ జంట ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. కానీ ఎట్టకేలకు ఆ సమయం ఆసన్నమైనట్టుగా అనిపిస్తోంది.

Image

- Advertisement -

అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షోలో హౌస్మెట్స్ ను పలకరించడానికి చై, శోభిత మొట్టమొదటిసారిగా కలసి గెస్టులుగా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న ఈ జంట కోసం బిగ్ బాస్ మేకర్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఇక వీళ్ళిద్దరూ హౌస్ లో అడుగు పెడితే టిఆర్పి రేటింగ్ ఆకాశాన్ని తాకడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.

పెళ్లి అక్కడేనా?

చై, శోభిత 2024 ఆగస్టు 8న హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ వేడుకకు ఇటు నాగార్జున కుటుంబంతో పాటు అటు శోభిత ఫ్యామిలీకి సంబంధించిన అతి కొద్దిమంది దగ్గర బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ విషయాన్ని తెలియజేయడానికి నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియాలో అఫీషియల్ గా ఫోటోలను రిలీజ్ చేశారు. మొత్తానికి వారిద్దరికీ తన బ్లెస్సింగ్స్ అందిస్తూ శోభిత, నాగచైతన్య నిశ్చితార్థం బాగా జరిగిందనే విషయాన్ని వెల్లడించారు. అప్పటిదాకా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లకు ఈ ఫోటోతో ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక నాగ చైతన్య, శోభిత రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అక్కడే ఉన్న యూనియన్ ప్యాలెస్ లో ఈ వివాహం జరగబోతుందని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు