Bigg Boss Telugu 8 Day 2 Promo 2: సీత Vs నిఖిల్.. కొట్టుకున్నంత పని చేశారుగా..?

Bigg Boss Telugu 8 Day 2 Promo 2.. తాజాగా బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం అవ్వగా.. అందులో రెండవ రోజు ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తున్నట్లయితే నిఖిల్ (Nikhil ) అలాగే కిర్రాక్ సీత (Kiraak Sita) దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. అసలేమైందో ఇప్పుడు చూద్దాం. తాజాగా మొదటి వారంలో భాగంగా నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మొదటి వారమే తిట్టుకోవడం , అరచుకోవడం మొదలుపెట్టేశారు. నామినేషన్ లో కూడా రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఈరోజు విడుదలైన మొదటి ప్రోమోలో సోనియా వర్సెస్ ప్రేరణ, సోనియా వర్సెస్ బేబక్క, శేఖర్ వర్సెస్ మణికంఠ ఏ రేంజ్ లో ఫైట్ పడ్డారో ప్రోమో చూస్తే అర్థమయింది.

Bigg Boss Telugu 8 Day 2 Promo 2: Sita Vs Nikhil.. Did they fight..?
Bigg Boss Telugu 8 Day 2 Promo 2: Sita Vs Nikhil.. Did they fight..?

నాగ మణికంఠకు వ్యతిరేకంగా హౌస్ మేట్స్..

ఈ ప్రాసెస్ లో యష్మి గౌడ , నిఖిల్ , నైనిక చీఫ్ లుగా ఉండగా , వీరికి నామినేషన్స్ ఉండవు. మొదటి వారమే నాగమణికంఠకు నామినేషన్స్ గుద్ధి పారేశారు హౌస్మెట్స్. అందరూ ఎవరితో కలవడం లేదని, అసలు మాట్లాడటం లేదని, ఒంటరిగా ఉంటున్నాడని , ఇలా ఏదో ఒక రీసన్ చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే మొదటి వారం ఎక్కువగా నామినేషన్స్ పడింది మాత్రం నాగ మణికంఠకే అని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదలైన బిగ్ బాస్ సెకండ్ ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్స్ ఏకంగా కొట్టుకున్నంత పని చేశారు.

నబీల్ – మణికంఠ మధ్య మాటల యుద్ధం..

ఎప్పుడూ ఒంటరిగా ఉండే నాగమణికంఠ సోఫా లో నిద్రలోకి జారుకున్నాడు. కుక్కలు అరవడంతో హౌస్ మేట్స్ మొత్తం అతడి తీరుపై అసహనం కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత నామినేషన్ లో నబీల్ ఆఫ్రిది నేరుగా నాగమణికంఠను నామినేట్ చేస్తూ ఒంటరిగా కూర్చున్నాడు. కెమెరాతో మాట్లాడుతున్నాడు అంటూ రీజన్ చెప్పడంతో కౌంటర్ ఇచ్చాడు నాగ మణికంఠ . ఒంటరిగా కూర్చొని పాటలు పాడుతున్నాను అంటూ మణికంఠ చెప్పడంతో, వచ్చింది పాటలు పాడడానికి కాదు అంటూ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు నబీల్.

- Advertisement -

కొట్టుకున్నంత పని చేసిన కిర్రాక్ సీత – నిఖిల్..

తర్వాత శేఖర్, బేబక్కను, నాగమణికంఠను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత నటుడు పృథ్వీరాజ్ కిచెన్ లో ఎవరికీ హెల్ప్ చేయడం లేదంటూ పృథ్విరాజ్ ను నామినేట్ చేయడంతో మధ్యలోకి దూరిపోయింది కిర్రాక్ సీత. నిన్న గిన్నెలు కడిగాడు అక్క అంటూ మధ్యలో మాట్లాడటంతో, నిఖిల్ వద్దని వారించాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ నిఖిల్ అరవడంతో నా ఇష్టం మాట్లాడుతాను అంటూ విరుచుకు పడిపోయింది కిర్రాక్ సీత. ఇక ఇద్దరి మధ్య మాటలు యుద్ధం నడిచింది. ఇక కాసేపాగితే ఇద్దరు కొట్టుకుంటారేమో అనేంతలా వాదనలాడుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో మరింత ఉత్కంఠభరితంగా మారిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు