Viswam Movie Teaser: జగన్ పై సెటైర్ వేసాడా.? సపోర్ట్ చేసాడా.?

Viswam Movie Teaser: శ్రీను వైట్ల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులలో శ్రీను వైట్ల శైలి వేరు అని చెప్పొచ్చు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రతి మీమ్ కంటెంట్ కూడా శ్రీనువైట్ల సినిమాల నుంచి వచ్చిందని చెప్పొచ్చు.ఇకపోతే నీకోసం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. కానీ శ్రీను వైట్లకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ఆనందం అని చెప్పొచ్చు.

శ్రీను వైట్ల చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అంటే శ్రీను వైట్ల అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ మినహాయిస్తే దాదాపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా పనిచేసే అవకాశం శ్రీనువైట్లకి దక్కింది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున సీనియర్ స్టార్ హీరోలు అందరితో పని చేసే అవకాశం దొరికిన ఒక డైరెక్టర్ శ్రీను వైట్ల అని చెప్పొచ్చు.

Viswam

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం శ్రీను వైట్ల ఒక హిట్ సినిమాను చూసి చాలా రోజులైంది. ఒకప్పుడు ప్రేక్షకులు శ్రీనువైట్ల సినిమా అంటేనే హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు గ్యాంగ్ తో వెళ్లొచ్చు అని ఫీల్ అయ్యేవాళ్ళు. శ్రీను వైట్ల సినిమాలో కామెడీ టైమింగ్ ప్రత్యేకమని చెప్పొచ్చు. మంచి క్యారెక్టర్స్ ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్స్ తో కామెడీని పండించగలడంలో ఒకప్పుడు శ్రీను వైట్ల దిట్ట. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ శ్రీనువైట్ల సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాకి విశ్వం అనే టైటిల్ ఖరారు చేశారు.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇ టీజర్ లో జగన్ ఫేమస్ డైలాగ్ ఒకటి వినిపిస్తుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఓడిపోయినప్పుడు.. కొట్టాడు మేము తీసుకున్నాం, రేపు మా టైం వస్తది మేము కొడతామని చెప్పిన తర్వాత గెలిచాడు. సేమ్ డైలాగ్ ఈ సినిమాలో పెట్టారు. అయితే ఈ డైలాగ్ దానికి సెటైర్ అవ్వాలి. లేకుంటే ఇప్పుడు జగన్ ఓడిపోయాడు కాబట్టి ఈ రోజు ఓడిపోయిన రేపు గెలుస్తాడు అనే ఇంటెన్షన్ తో సపోర్ట్ చేశాడా అనేది కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు