Nivin Pauly : అవకాశం ఇప్పిస్తానని అమ్మాయిపై అత్యాచారం… స్టార్ హీరోపై కేసు నమోదు

Nivin Pauly : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై కేరళ ప్రభుత్వం నియమించిన హేమ కమిటీ ఇటీవలే నివేదికను విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా అన్నీ చిత్రసీమలు ఉలిక్కి పడ్డాయి. ఇక అందులో పలు దిగ్భ్రాంతికర సంఘటనలు ఉండడంతో హేమ కమిటీ అన్ని భాషల సినీ పరిశ్రమలలో చర్చనీయాంశంగా మారింది. దీని తరువాత చాలా మంది మలయాళ నటీమణులు, నటులు, సాంకేతిక నిపుణులపై లైంగిక ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మలయాళ స్టార్ హీరోలలో ఒకరైన నివిన్ పౌలీపై అత్యాచారం కింద కేసు నమోదైంది.

అవకాశం పేరుతో అమ్మాయిపై అత్యాచారం

నటుడు నివిన్ పౌలీపై వేధింపుల ఫిర్యాదు దాఖలైంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఎర్నాకులం ఊనుంకల్ పోలీసులు ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేశారు. గత నవంబర్‌లో దుబాయ్‌లో తనను నివిన్ పౌలీతో కలిపి ఆరుగురు చిత్రహింసలకు, లైంగిక వేధింపులకు గురి చేశారన్నది ఆ మహిళ ఫిర్యాదు సారాంశం. దీంతో సినిమాలో పాత్ర ఇప్పిస్తానన్న నెపంతో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నివిన్ పౌలీపై కేసు నమోదైంది.

Mahaveeryar' presents a serious issue women are facing today: Nivin |  Entertainment Interview | English Manorama

- Advertisement -

నిందితుల్లో నిర్మాత కూడా..

ఈ కేసులో నివిన్ పౌలీని ఆరో నిందితుడిగా పేర్కొనగా, మలయాళ నిర్మాత ఎకె సునీల్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. ఊన్నుకల్ పోలీసులు మొత్తం హీరో, నిర్మాతతో కలిపి ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కొత్త ఆరోపణలను విచారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కి వారు దానిని బదిలీ చేస్తారు. ఇక ఇతర నిందితులలో శ్రేయ అనే అమ్మాయి, బషీర్, కుట్టన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీరందరిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

9 మందిపై ప్రముఖులపై కేసు నమోదు

మలయాళ చిత్ర పరిశ్రమలో అనేక లైంగిక వేధింపుల కేసులు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన తరుణంలో ఒక హీరోపై అత్యాచారం ఆరోపణల్లో కేసు నమోదు కావడం దుమారం రేపుతోంది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఈ నెల ప్రారంభంలో బయటకు వచ్చాక మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న దారుణాలన్నీ బయట పడుతున్నాయి. ఇప్పటికే పలువురు మహిళా నటీమణులు ఫిర్యాదులు చేయడంతో ముఖేష్, సిద్ధిక్, జయసూర్య, ఎడవెల బాబు, మణియన్ పిళ్లై రాజు, దర్శకులు రంజిత్, వీకే ప్రకాష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌లు విచ్చు, నోబెల్‌లతో సహా తొమ్మిది మంది సినీ ప్రముఖులపై ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ముందస్తు బెయిల్ కు ప్రయత్నాలు

బాధితులచే దోపిడీదారులుగా పేర్కొన్న వారిలో ఒకరైన ముఖేష్ ఈ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకుని బుధవారం వరకు అరెస్ట్ ను ఆపగలిగాడు. ఈరోజు తెల్లవారుజామున చిత్ర దర్శకుడు రంజిత్ కూడా కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ ఇటీవల మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అతను అసోసియేషన్ అధ్యక్షుడిగా, 17 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహక కమిటీని కలిగి ఉన్నాడు. అయితే కమిటీలోని సభ్యులంతా ఉమ్మడిగా రాజీనామాలు సమర్పించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు