Pawan Kalyan : ఆంధ్రకో న్యాయం – తెలంగాణకో న్యాయమా… నీ కల్ట్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా ఉన్నారు పవన్

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలు వరదలుగా మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు నిండా మునిగి సంద్రాన్ని తలపిస్తుంటే, మరోవైపు తెలంగాణలోనూ కొన్నిచోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల కారణంగా కష్టాలు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి పలువురు స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. వర్షాలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన డొనేషన్ మాత్రం చర్చకు దారి తీసింది. ముఖ్యంగా తెలంగాణ అభిమానుల నుంచి పవన్ కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆయన ఎంత డొనేట్ చేశారు ? ఎందుకు తెలంగాణ పవన్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

ఏపీకి పవన్ భారీ విరాళం…

తెలుగు రాష్ట్రాల్లో వరదలు, ప్రజల కష్టాలపై ఆవేదనను వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు భారీగా విరాళాలు ప్రకటించారు. అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంపై ఊహించని విధంగా చాలా లేట్ గా రియాక్ట్ అయ్యారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల ప్రకటిస్తూ ఓ నోట్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా తదితర ఉన్నతాధికారులతో కలిసి పరిస్థితులపై సమీక్షను నిర్వహించారనీ ఆ నోట్లో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కేవలం ఏపీకి మాత్రమే ఈ విరాళాలను ప్రకటించారు. కానీ తెలంగాణ గురించి కనీసం ప్రస్తావించలేదు. మరి పవన్ తెలంగాణకు కూడా ప్రత్యేకంగా విరాళాలు ప్రకటిస్తారా? లేదంటే అసలు పట్టించుకునే ఆలోచనలో లేరా? అనే విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

Official: Entire Family Backing Pawan Kalyan

- Advertisement -

తెలంగాణలో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు

పవన్ కేవలం ఏపీకి మాత్రమే విరాళాలు ప్రకటించారు అన్న విషయం తెలుసుకున్న తెలంగాణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆంధ్రకో న్యాయం, తెలంగాణకో న్యాయమా? అంటూ పవన్ ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్నాడు అంటే కేవలం ఏపీలో ఉన్న అభిమానులే కాదు, తెలంగాణలో ఉన్న కల్ట్ ఫ్యాన్స్ కూడా ఒక కారణం అంటూ గుర్తు చేస్తున్నారు. కేవలం ఓటు వేయలేరు అన్న కారణంతో ఇంత దారుణంగా తెలంగాణను చిన్న చూపు చూస్తారా ? అంటూ పవన్ పై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అశ్విని దత్ పవన్ కళ్యాణ్ లాగే కేవలం ఏపీకి మాత్రమే విరాళాలు ప్రకటించడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుల పిచ్చి, బ్రతికేదేమో తెలంగాణలో, ప్రేమ కురిపించేదేమో ఏపీపై అంటూ మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విమర్శలకు ఎలా సమాధానం చెప్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు