BiggBoss8 : తొలివారం అందరూ సిల్లీ రీజన్సే.. అందరికి ఒకే కారణం.. అదేంటంటే?

Bigg Boss 8 : బుల్లితెర ప్రియులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా సీజన్ 8 సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైందని తెలిసిందే. ఇక మొదటి ఎపిసోడ్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా, ఇందులో పలు టీవీ సీరియల్స్ నటులు, సినిమా నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈసారి బుల్లితెర నటులు ఎక్కువగా ఉండడంతో టెలివిజన్ ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా షో మొదలై మూడు రోజులు కూడా కాలేదు. అప్పుడే నామినేషన్ల (Biggboss nominations) ప్రక్రియ మొదలైంది. అయితే నామినేషన్లలో ఎవరూ ఒక సరైన కారణం కూడా లేకుండా అంతా చిన్న చిన్న రీజన్లకే నామినేట్ చేయడం స్టార్ట్ చేసారు.

In the first week of the BiggBoss8 house, everyone was nominated for silly reasons

ఈ ముగ్గురూ నామినేషన్ నుండి సేఫ్…

ఇక హౌస్ లో ముందుగా హౌస్ చీఫ్ గురించి టాస్క్ లు జరగగా అందులో ముగ్గురు గెలిచినా విషయం తెలిసిందే. యష్మి గౌడ , నిఖిల్ , నైనిక హౌస్ చీఫ్ లు గా గెలవడం జరిగింది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇక యష్మి గౌడ, నిఖిల్, నైనికా చీఫ్ లు కావడంతో ఈ వారం వీరు నామినేషన్స్ నుండి సేఫ్ అవుతారని, వీరిని నామినేట్ చేయడం కుదరదని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక నామినేషన్లలో నామినేషన్స్ లో ఎక్కువగా నాగమణికంఠ (Nagamanikantha), బేబక్క, నబీల్, సోనియా, సీత ఎక్కువగా మధ్య నామినేషన్స్ తో పాటు వాగ్వాదం బాగా జరిగింది. ఇక మొదటివారమే అయినా ఒకరితో ఒకరికి పడనట్లు చిన్న చిన్న కారణాలకు నామినేట్ చేసుకున్నారు.

- Advertisement -

అంతా సిల్లీ రిజన్లే.. ఫైనల్ గా ఒకటే కారణం?

ఇక ఈ నామినేషన్స్ లో ఎక్కువగా కంటెస్టెంట్స్ చిన్న చిన్న రీసన్స్ నే వేలెత్తి చూపగా, ఓవరాల్ గా అందరి కారణాలు గమనిస్తే.. ఒకే కారణం వస్తుంది. ఒక కంటెస్టెంట్ అందరితో కలవదట్లేదని, ఒక్కడే వన్ సైడ్ ఉంటున్నారని, పనుల్లో తనకు తానుగా పాలుపంచుకోవట్లేదని, మిగతా వాళ్ళతో సరిగా మింగిల్ అవ్వట్లేదని నామినేట్ చేస్తున్నారు. ఈ రకమైన కారణాలతోనే నాగమణికంఠ, నబీల్ అఫ్రీది (Nabeel), బెబక్క, ప్రేరణ నామినేట్ అయ్యారు. నెటిజన్లు అయితే మొదటివారం పెద్దగా ఏ కారణం దొరకలేదు కాబట్టి ఇలా నామినేట్ చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఎక్కువగా నామినేట్ అయింది నాగమణికంఠ. ఆ తర్వాత బేబక్క. మరి తొలివారం నామినేషన్లలో ఎలిమినేట్ అయ్యేవారు ఎవరో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు