Bigg Boss: ఆ రివ్యూవర్ ఫేక్ అంటున్న జబర్థస్త్ యాక్టర్..!

Bigg Boss.. బిగ్ బాస్ (Bigg Boss).. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో.. కొత్త సీజన్ మొదలైతే చాలు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో రివ్యూస్ , రివ్యూవర్స్ కనిపిస్తూ ఉంటారు. అయితే వారిలో కొంతమంది జన్యూన్ గా రివ్యూ ఇస్తే , మరికొంతమంది వ్యూస్ కోసం తప్పుడు విషయాలను కూడా ఆడియన్స్ కు చేరవేస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది తాము చెప్పేదే కరెక్ట్ అంటూ ఆడియన్స్ ను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో కూడా ఫేక్ ఉన్నారంటూ ఒక జబర్దస్త్ కమెడియన్ ముందుకు వచ్చారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి (Adi reddy) ఫేక్ రివ్యూవర్ అంటూ జబర్దస్త్ కమెడియన్ మహీధర్ (Mahidhar)చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Bigg Boss: That reviewer is a fake actor..!
Bigg Boss: That reviewer is a fake actor..!

ఆదిరెడ్డి బిగ్గెస్ట్ బిగ్ బాస్ స్కామర్..

నిజానికి రివ్యూవర్ గా ఆదిరెడ్డి మంచి పేరు సొంతం చేసుకున్నారు. దీనికి తోడు ఇలా రివ్యూస్ ఇస్తూనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అవకాశాన్ని దక్కించుకొని, టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచారు. ఆదిరెడ్డి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు అని కొంతమంది కామెంట్ చేస్తారు. అందుకే లక్షల వ్యూస్, వేలల్లో లైక్స్ మాత్రమే కాదు వందల్లో కామెంట్లు కూడా ఆయన వీడియోలకు వస్తూ ఉంటాయి. అయితే ఆదిరెడ్డి చేసే కామెంట్లు అంతా అబద్ధాలు అని, తప్పుడు రివ్యూస్ అని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రివ్యూ ఇస్తూ ఉంటాడు అంటూ తోటి బిగ్ బాస్ రివ్యూవర్ , జబర్దస్త్ ఆర్డిస్ట్ మహీధర్ హాట్ కామెంట్ చేస్తూ, ఆదిరెడ్డి బిగ్గెస్ట్ బిగ్ బాస్ స్కామర్ అంటూ ఒక థంబ్ నైల్ పెట్టి వీడియో కూడా విడుదల చేశారు. అందులో మహిధర్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.

సీజన్ 6 ఫ్లాప్ కావడానికి ఆదిరెడ్డి ప్రధాన కారణం..

మహీధర్ మాట్లాడుతూ.. గతంలో నేను ఆదిరెడ్డిని తొమ్మిది ప్రశ్నలు అడిగితే ,ఆయన కేవలం నాకు ఫోన్ చేసి ఐదు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు.నేను అడిగిన ప్రశ్నకు, ఆయన చెప్పిన సమాధానానికి పొంతనే లేదు. మిగిలిన 4 ప్రశ్నలకు సమాధానం అసలు చెప్పలేదు.ఈ వీడియోను చూశాక మీరు నాకు ఎలాంటి మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయవద్దు. కేవలం యూట్యూబ్ లో మాత్రమే స్పందించండి అంటూ తెలిపారు మహిధర్.. బయటకు ఆదిరెడ్డి గురించి మీకు తెలిసిన వాటికంటే ఇంకా ఎక్కువ నాకు తెలుసు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా ఆదిరెడ్డి అని నేను బల్లగుద్ది చెబుతున్నాను అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు మహిధర్.

- Advertisement -

ఆదిరెడ్డి ఇచ్చే రివ్యూ అంతా అబద్ధం..

ముఖ్యంగా సీజన్ సెవెన్ లో ఒక కామన్ మ్యాన్.. టైటిల్ విన్నర్ గా నిలవడానికి కూడా కారణం ఆదిరెడ్డి. శివాజీని కావాలని నెగిటివ్ చేసి చూపించాడు అనేది నిజం. నిజానికి శివాజీని నెగిటివ్ గా చూపించాలనే ఉద్దేశంతో చేసినా కొన్ని అలా జరిగిపోతున్నా కూడా ఆదిరెడ్డి కారణం అవుతున్నాడు. ఇతడు ఒక ఫెయిల్యూర్ రివ్యూవర్. రివ్యూవర్ అంటే హౌస్ లో జరిగే ప్రతి విషయాన్ని కూడా పంచుకోవాలని, ముఖ్యంగా బ్యాక్ స్టోరీ ఏం జరిగిందో చెప్పాలి కానీ ఆయన అలా చెప్పడు. ఆడియన్స్ కు నిజం తెలియకుండా చేస్తూ.. తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాధ్యత ఉండక్కర్లేదా..

ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటేస్టెంట్ గా ఆదిరెడ్డి వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఆయనకి ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. ఎందుకంటే అక్కడ జరిగేది ఆయనకు తెలుసు కాబట్టి. ఆయన చెప్పేవి నిజం ఉంటాయని చాలామంది ఆయనను ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఆదిరెడ్డి బాధ్యతగా ఉండాలి కానీ అలా చేయడం కూడా తప్పు. ఒక సాధారణ యూట్యూబర్గా చెబుతున్నాడు. ఇన్ అండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అది ఏమాత్రం చేయకుండా న్యూట్రల్ అనే ముసుగులో పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేశారు. ఇకనైనా ఆదిరెడ్డి మంచి రివ్యూస్ ఇస్తారని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు