Tollywood : ఇండియన్ ఫేమస్ స్టార్ క్రికెటర్లలో సురేష్ రైనా ఒకరు. 20స్ లో సూపర్ ఫామ్ లో ఉన్న క్రికెటర్ 2011, 2015 వరల్డ్ కప్స్ లో తనదైన ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టిచాడు. ఇక ఇప్పుడు క్రికెట్ కి పూర్తిగా అన్ని ఫార్మాట్లలోనూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా పలు క్రికెట్ కార్యక్రమాల్లో మెంటార్ గా, ట్రైనర్ గా కొనసాగుతూ ఉన్నాడు. ఇక రీసెంట్ గా “ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్” (ISPL) లో చెన్నై టీమ్ తరపున పార్టనర్ గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సురేష్ రైనా (Suresh Raina) తన ఫేవరేట్ స్టార్ హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
నా ఫేవరేట్ స్టార్ రామ్ చరణ్ – సురేష్ రైనా
ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సురేష్ రైనా సినిమాల గురించి వచ్చిన ప్రస్తావన లో ఈ ఫేవరేట్ హీరో ఎవరూ అని.. యాంకర్ అడగగా చాలా ఇంట్రెస్టింగ్ గా సురేష్ రానా సమాధానం ఇచ్చాడు. హిందీలో అయితే తన ఫేవరేట్ హీరోలు సిద్ధార్థ్ కపూర్, షాహిద్ కపూర్ అని, అయితే తనకు సౌత్ హీరోలు ఎక్కువగా ఇష్టమని తమిళ్ లో అయితే సూర్య (Surya) తన ఫేవరేట్ స్టార్ అంటూ.. సూర్య కళ్ళు బాగుంటాయని చెప్పుకొచ్చాడు. ఇక తెలుగులో అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన ఫేవరేట్ అని.. తన కళ్ళల్లో ఫైర్ ఉంటుందని.. ఇండియా లోనే చరణ్ వేరే లెవెల్ యాక్టర్ అని చెప్పుకొచ్చాడు. ఇక సురేష్ రైనా ఈ నెల 20న జరుగనున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్ టోర్నీ లో ఆడనున్నాడని సమాచారం.
చరణ్ సినిమా రిలీజ్ కి రెడీ..
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే… RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ పలువురు సెలెబ్రిటీలే కాదు… బిజినెస్ మేన్స్, క్రికెట్ సెలెబ్రిటీలు, పొలిటిషన్స్ చేత కూడా ప్రశంసలు పొందాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా షూటింగ్ ఫినిషింగ్ దశలో ఉండగా, డిసెంబర్ 20న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు తో తన 16వ సినిమాని స్టార్ట్ చేయనుండగా, ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేయనున్నాడు.