Chiranjeevi : వరద బాధితులకు అండగా చిరు… సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన అవసరం మనందరికీ ఉంది – చిరంజీవి

Chiranjeevi : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయన్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా వరుణుడు రెండు రాష్ట్రాలపై భీభత్సం సృష్టిస్తుండగా, చెరువులు, నదులు పొంగి పొర్లుతూ రెండు రాష్ట్రాల్లో వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. రోడ్లపై కూడా భారీగా నీరు చేరి చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో జన జీవనం స్థంభించిపోయింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు రిస్క్యూ ఆపరేషన్ చర్యలు ప్రారంభించారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను ఇతర ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో వరద భీభత్సం మరింత ఉదృతంగా ఉంది. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ (Tollywood) నుండి కూడా సాయం అందుతుంది. అయితే కొన్ని రోజుల ముందు నుండే వరద బాధితులకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల అభిమానులు ఆహరం అందించడం వంటి సహాయాలు చేస్తున్నారు. ఇక చిత్ర పరిశ్రమ నుండి కూడా స్టార్ హీరోలు సెలబ్రటీల నుండి భారీగా విరాళాలు అందుతున్నాయి.

Chiranjeevi stands by the flood victims. Megastar announced a donation of 1crore

వరద బాధితులకు అండగా చిరు..

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నిలిచారు. తాజాగా కాసేపటికిందే సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు.. “తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు సాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను… అంటూ చిరంజీవి పోస్ట్ చేసారు.

- Advertisement -

చిత్ర పరిశ్రమ నుండి భారీగా విరాళాలు

ఇక తెలుగు రాష్ట్రాల్లో వరద భీభత్సానికి ప్రజల్ని ఆదుకోవడానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చేయూతనిస్తుంది. నిన్నటి నుండి భారీగా విరాళాలు అందుతున్నాయి. ముందుగా ఎన్టీఆర్ (NTR) రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు ప్రకటించగా, మహేష్ బాబు (Mahesh babu) కూడా చెరో 50 లక్షలు ప్రకటించాడు. ఇక పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కూడా 1 కోటి రూపాయలు, బాలకృష్ణ కోటి రూపాయలు, సిద్ధూ జొన్నలగడ్డ 30 లక్షలు, విశ్వక్ సేన్ 10 లక్షలు నిర్మాత అశ్వినీదత్ 25 లక్షలు ప్రకటించారు. ఇప్పుడు కూడా స్టార్ హీరోలు విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు