The GreatestOfAllTime : విజయ్ ‘ది గొట్’ మూవీ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్…ఇక్కడ కెరీర్ బెస్ట్..

The GreatestOfAllTime : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా తెరకెక్కిన ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం’ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ లాస్ట్ మూవీ అని చెప్పడం వల్ల దళపతి ఫ్యాన్స్ ఊహించని రేంజ్ లో ఈ సినిమాకి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక వెంకట్ ప్రభు (Venkat prabhu) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లతో మంచి హైప్ తెచ్చుకుంది. పాటల పరంగా ట్రోల్ అయినా కంటెంట్ బాగుండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

The Greatest Of All Time Movie Business & Break Even Target

గోట్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్..

ఇక దళపతి విజయ్ గొట్ (The GreatestOfAllTime) సినిమా బిజినెస్ వివరాలు రాగా, వరల్డ్ వైడ్ గా మంచి బిజినెస్ చేసిందేనని చెప్పాలి. లియో సినిమా కంటే, కాస్త తక్కువే చేసినా ఓవరాల్ గా అదరగొట్టింది. ఇక ఏరియా వారీగా గోట్ బిజినెస్ గమనిస్తే.. తమిళనాడు 76 కోట్లు, కర్ణాటక 11 కోట్లు, కేరళ 15 కోట్లు, జరగగా, తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా లో 7 కోట్లు ఓవర్సీస్ లో 55 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా గోట్ సినిమాకు 185 కోట్ల బిజినెస్ జరగగా, బ్రేక్ ఈవెన్ కావాలంటే 187 కోట్ల వసూళ్లు రావాలి. అంటే ఆల్మోస్ట్ 350 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాలి.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కెరీర్ బెస్ట్…

ఇక గోట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల బిజినెస్ చేయగా, విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ జరిగిందని చెప్పాలి. ఇంతకు ముందు తెలుగు రాష్ట్రాల్లో లియో 16 కోట్ల బిజినెస్ చేయగా, ఇప్పుడు లియో దాన్ని బ్రేక్ చేసింది. అయితే లియో (Leo) రేంజ్ లో ఈ సినిమా ఆడుతుందా అంటే డౌటే అని చెప్పాలి. కానీ భారీ అంచనాలున్న ఈ సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా, భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందనడంలో సందేహం లేదు. అయితే లాంగ్ రన్ లో ఆడాలంటే యానానిమస్ గా ఎన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావాల్సి ఉంటుంది. ఇక ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమాలే ఉండడంతో మాస్ ప్రేక్షకులకు ఫస్ట్ ఆప్షన్ గా గోట్ నిలుస్తుంది. మరి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న గోట్ ఎంత వరకు అంచనాలు అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు