Tollywood: టాలీవుడ్ లో పొట్టి హీరోయిన్ ఎవరంటే.. హైట్ ఎంతంటే..?

Tollywood.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అదృష్టం అనేది ఎప్పుడు..? ఎవరికి..? ఎలా..? తలుపు తడుతుందో చెప్పడం అసాధ్యం. కొంతమంది హీరోయిన్లు అందం, అభినయంతో ఆకట్టుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీలు అయిపోతే.. మరి కొంతమంది అందం, అభినయం ఉన్నా నటన, ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం లేక ఇండస్ట్రీకి దూరమవుతున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే సాధారణంగా హీరోయిన్ అంటే అందం, అభినయం , నటన ,ఆ అందానికి తగ్గట్టు హైట్ అన్నీ ఉంటేనే అవకాశాలు వస్తాయని అందరూ అంటారు. కానీ అవేవి అక్కర్లేదు నటన ప్రతిభ ఉంటే చాలు స్టార్ సెలబ్రిటీ అయిపోవచ్చు అని నిరూపిస్తున్నారు కొంతమంది భామలు. ముఖ్యంగా పొట్టిగా ఉన్నా తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. మరి ఇండస్ట్రీలో అందరికంటే తక్కువ హైట్ ఉన్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Tollywood: Who is the shortest heroine in Tollywood? What is her height?
Tollywood: Who is the shortest heroine in Tollywood? What is her height?

సినీ ఇండస్ట్రీలో పొట్టి హీరోయిన్ గా నివేదా..

ఆమె ఎవరో కాదు నివేదా థామస్(Niveda thamous). 2016లో నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. చూడడానికి ఎంతో చక్కగా పక్కింటి అమ్మాయిలా కుందనపు బొమ్మలా ఉంటుంది. 2002లో మలయాళ చిత్రం ఉత్తర అనే సినిమాతో బాలనాటిగా అడుగుపెట్టిన ఈమె, ఇప్పుడు హీరోయిన్ గా చలామణి అవుతూ దూసుకుపోతోంది. అంతేకాదు ఇప్పుడున్న హీరోయిన్స్ అందరికంటే కూడా ఈమె చాలా హైట్ తక్కువగా ఉంటుంది. నివేదా హైట్ కేవలం 5.1 మాత్రమే.

నిత్యా మీనన్ హైట్ కేవలం 5.2 మాత్రమే..

రెండవ స్థానంలో నిత్యామీనన్ నిలిచింది. ఈమె హైట్ 5.2. ఇక అంతకు ముందు నిత్యమీనన్ కూడా తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి అభిమానులకు దగ్గర అయింది.ఇటీవలే ఈమె కుమారి శ్రీమణి అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి అందర్నీ ఆకట్టుకుంది.

- Advertisement -

పొట్టిగా ఉన్నా పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న సమంత..

ఇక మూడవ స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిలిచింది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె, ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కూడా నటించి మెప్పించింది. ఇక ఈమె టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. నాగచైతన్య తో విడాకుల తరువాత కథల ఎంపిక విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బోల్డ్ పాత్రలు సైతం చేస్తూ దూసుకుపోతోంది. అందుకే బాలీవుడ్ లో కూడా పేరు మోసిన హీరోయిన్ గా ఇమేజ్ సొంతం చేసుకుంది సమంత. ఇక ఈమె హైట్ 5.3 అడుగులు..

పొట్టి హీరోయిన్స్ జాబితాలో నాలుగవ స్థానం..

నాలుగవ స్థానంలో కీర్తి సురేష్ నిలిచింది. తెలుగులో మహానటి సినిమాతో పేరు సొంతం చేసుకున్న ఈమె ఇటీవల కల్కి సినిమాలో బుజ్జి వెహికల్ కి తన వాయిస్ ఓవర్ అందించి మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగులో ఉండే దాదాపు చాలామంది హీరోలతో నటించిన కీర్తి సురేష్ బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి , నేను శైలజ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈమె హైట్ 5.3 ఫీట్. మొత్తానికైతే సౌత్ సినీ ఇండస్ట్రీలో పొట్టి హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది నివేదా థామస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు