Devara Song : దేవర నుంచి మూడో సింగిల్ వచ్చేసింది.. ఏమున్నాయి మామా లిరిక్స్..

Devara Song : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్నా సినిమా దేవర.. త్రిపుల్ ఆర్ తర్వాత రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయ్యి కళ్ళతో సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా విడుదల చేస్తున్నారు. మొన్నీమధ్య వచ్చిన సెకండ్ సాంగ్ చుట్టమల్లే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా మూడో సాంగ్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

devara davudi song released
devara davudi song released

దావుడి అంటూ సాగే లిరిక్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నారు. సాంగ్ విడుదలైన క్షణాల్లోనే బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పక్క మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తారక్ సొంత నిర్మణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ సంయక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..

తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కుల మొత్తం రూ.110 కోట్లు ఉండవచ్చునని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు పోస్టర్ అప్డేట్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సాంగ్స్ పెద్దగా ఆడియన్స్ ను మెప్పించలేక పోయాయని తెలుస్తుంది. మొన్న రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ దెబ్బేసింది. తాజాగా రిలీజ్ అయిన దావుదీ సాంగ్ కూడా అలాంటి టాక్ ను అందుకుంది. ఫ్యాన్స్ కొరటాల శివ పై కోపంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమాకు మొదటి నుంచే మంచి హైప్ క్రియేట్ అవుతుంది. విడుదల అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు