Saripodhaa Sanivaaram : హిట్టొచ్చినా నాని హ్యాపీగా లేడా? నాని కష్టానికి ఫలితం లేకుండా పోయింది!

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న భారీ అంచనాలతో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ అయిన రోజు కొన్ని చోట్ల మిక్సడ్ రెస్పాన్స్ వచ్చినా, అన్ని చోట్లా సాలిడ్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో లేకపోయినా కంటెంట్ ఆడియన్స్ ని బాగానే మెప్పిస్తుంది. ఇక ఓపెనింగ్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ అనిపించుకోగా, ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు సాధించింది. అక్కడ ఏకంగా 2 మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసి నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకోనుంది ఈ సినిమా. ఇదిలా ఉండగా హీరో నాని మాత్రం సరిపోదా శనివారం సక్సెస్ పై అంత హ్యాపీగా లేడని టాక్ వినిపిస్తుంది. దానికి బలమైన కారణమే ఉంది.

Saripodhaa Sanivaaram is an underperforming in Hindi

ప్రమోషన్లలో చాలా కష్టపడ్డ నాని…

ఇక సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కొట్టాలని నాని ముందునుండే ఫిక్స్ అయ్యాడు. టైటిల్ అనౌన్స్ మెంట్ మొదలుకొని సినిమా టీజర్, ట్రైలర్ తో సహా సినిమా రిలీజ్ అయ్యేదాకా పాన్ ఇండియా (Pan india) భాషల్లో భారీగా ప్రమోట్ చేసారు మేకర్స్. ముఖ్యంగా నాని రెండు వారాలుగా హిందీ, తమిళ్, కన్నడలో కూడా భారీగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. ప్రమోట్ చేసారు. కానీ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. పాన్-ఇండియాకు వెళ్లాలనే నాని ఆశలకు సరిపోదా శనివారం గట్టిగా దెబ్బ కొట్టింది. ఒక్క తెలుగులో తప్ప ఏ భాషలోనూ ఈ సినిమాకు సరైన ఓపెనింగ్స్ రాలేదు. టాక్ తర్వాతైనా గ్రోత్ వస్తుందనుకుంటే అది అసలే జరగలేదు.

- Advertisement -

నాని కష్టానికి ఫలితం లేకుండా పోయింది..

ఇక సరిపోదా శనివారం హిందీలో అయితే డిజాస్టర్ ఓపెనింగ్స్ అందుకుంది. డబ్బింగ్ వెర్షన్ వారాంతంలో కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే రాబట్టింది. హిందీలో (Bollywood) ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు నాని (Nani) శతవిధాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అంచనాలను అందుకోలేకపోయింది. పాన్ ఇండియా మార్కెట్‌లో తనదైన ముద్ర వేయాలనే నాని డ్రీమ్‌ కు ఈ సినిమా మళ్ళీ అడ్డుపడిందని తెలుస్తుంది. లాస్ట్ టైం దసరా (Dasara) సినిమాకి కూడా నాని ఎంతో ట్రై చేసాడు. కానీ ఆడియన్స్ పట్టించుకోలేదు. ఓవరాల్ గా తెలుగు వెర్షన్ మాత్రమే చెప్పుకోతగ్గ వసూళ్లు రాగా, ఆంధ్ర ఏరియాల్లో అండర్ పెర్ఫార్మన్స్ చేసిందని చెప్పాలి. దానికి కారణం రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 38 కోట్ల షేర్ మార్క్ దాటేయగా, మరి రెండో వీకెండ్ లో సరిపోదా శనివారం ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు