Bigg Boss Telugu 8: ఫైర్ బ్రాండ్ గా మారిన సోనియా.. వర్మ టూ బిగ్ బాస్ ప్రయాణం..?

Bigg Boss Telugu 8.. ఎట్టకేలకు బుల్లితెరపై బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 8 కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ షోలో దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సోనియా ఆకుల (Sonia aakula). ప్రస్తుతం హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు సొంతం చేసుకుంది. రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో ఎంట్రీ ఇచ్చిన సోనియాకి వచ్చి రాగానే బిస్కెట్ వేసేసారు నాగార్జున(Nagarjuna ).నీ నవ్వు చాలా బాగుందంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు ఆమెకు సర్ప్రైజ్ ఇస్తూ.. స్క్రీన్ మీద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆమె కోసం పంపిన వీడియోని కూడా ప్లే చేశారు.

Bigg Boss Telugu 8: Sonia who has become a fire brand.. Varma to Bigg Boss journey..?
Bigg Boss Telugu 8: Sonia who has become a fire brand.. Varma to Bigg Boss journey..?

వర్మ టూ బిగ్ బాస్ ప్రయాణం..

అంతేకాదు నటనలో నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు కదా.. ఇప్పుడు హౌస్ లో నీ టాలెంట్ ఏంటో చూపించు.. నువ్వు కచ్చితంగా టైటిల్ గెలుస్తావు.. త్వరగా గెలిచి వచ్చేయ్.. మనం పార్టీ కూడా చేసుకుందాం అంటూ వర్మ తెలిపారు. స్టార్ డైరెక్టర్ వర్మ లాంటి వ్యక్తి ఈమెకు సపోర్టుగా నిలిచారు అంటే అసలు ఈమె ఎవరు ?ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి వర్మతో పరిచయం నుంచి బిగ్ బాస్ లో అవకాశం వరకు ఎలా ఈమె ప్రయాణం సాగిందో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ జాగృతిలో కీలక పాత్ర..

మంథని ప్రాంతానికి చెందిన సోనియా మంచి సోషల్ వర్కర్ . బిగ్ బాస్ స్టేజ్ పైకి అడుగుపెట్టిన ఈమె కరాటే ఫైటర్ అని చెప్పి , నాగార్జునతో పాటు అందరిని షాక్ అయ్యేలా చేసింది. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, ఆశ ఎన్ కౌంటర్ వంటి సినిమాలలో కీలకపాత్రలు చేసిన ఈమె అంతకుముందు జార్జ్ రెడ్డి సినిమాలో కూడా హీరోకి చెల్లి పాత్రలో నటించింది. ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే , బీటెక్ పూర్తి చేసిన సోనియా తెలంగాణ జాగృతిలో కీలకపాత్ర పోషించింది. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న ఈమె నెట్టింట షేర్ చేసే ప్రతి ఫోటోకి కూడా విపరీతమైన లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తూ ఉంటుంది.

- Advertisement -

సోనియా పై బిగ్ బాస్ ప్రత్యేక శ్రద్ధ..

అలా ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో అవకాశం అందుకొని హౌస్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తనదైన పర్ఫామెన్స్ తో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. నామినేషన్ ప్రక్రియలో సోనియా రెచ్చగొడితే ప్రేరణ ఆ ట్రాక్ లో పడిందా అనే విధంగా మనకు కనిపిస్తోంది . ఈ వాదన సందర్భంగా వారి ఆటిట్యూడ్ ఇంత దారుణంగా ఉంటుందా అనే విధంగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి . ప్రస్తుతం ఇదే పరిస్థితి మణికంఠలో కూడా కనిపించింది .వర్మ స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి బిగ్ బాస్ టీం కూడా సోనియాని చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే గతంలో వర్మా స్కూల్ నుంచి వచ్చిన అరియాణాకి కూడా రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. అలాగే అషు రెడ్డికి కూడా మంచి మర్యాదలే ఇచ్చింది బిగ్ బాస్. ఇప్పుడు సోనియాకి కూడా అంతే ఫెసిలిటీస్ కల్పిస్తోంది. మొత్తానికి అయితే సోనియా ఆకుల మీద అభిమానులు గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. మరి అరియానా, అషు రెడ్డి లాగా అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేక తన పెర్ఫార్మెన్స్ తో టైటిల్ విన్నర్ గా గా నిలుస్తుందా ?అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు