Pawan Kalyan : డిప్యూటీ సీఏం సారూ.. ఇలా చేస్తారని మేము అస్సలు ఊహించలేదు..

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వరద ఉదృతి కాస్త ఎక్కువగానే ఉంది. వరదల కారణంగా చాలా మంది సర్వం కోల్పోయారు. ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురుచూస్తూ చీకటిలో బ్రతికేస్తున్నారు. రాజకీయ నేతలు పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షస్తూ ప్రజలకు అన్ని వసతులను కల్పిస్తున్నారు. అయితే సీఏం చంద్రబాబు నాయుడు సైతం ముంపు ప్రాంతాలను ప్రత్యేక్షంగా వెళ్లి చూసారు. కానీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) మాత్రం ఏ ప్రాంతానికి వెళ్లలేదని తెలుస్తుంది. ఈ విషయంలో ఏపీ ప్రజలు, పవన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి ముంపు ప్రాంతాలను ఎందుకు సందర్శించలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి..

ఏపీ వరద ప్రాంతాలను ఎందుకు పర్యటించలేదో చెప్పిన పవన్ కళ్యాణ్..

సినీ నటుడుగా పవన్ కళ్యాణ్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. రాజకీయణాయకుడుగా మాత్రం నిరూపించుకోవాలంటే ఇదే సరైన సమయం అని కొందరు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే తాను దూరంగా ఉన్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నేను సాయపడాలి కానీ అధికార యంత్రాంగానికి అదనపు భారం కాకూడదు అని పవన్ కల్యాణ్ అన్నారు. అక్కడికి వెళ్లి పర్యటించాలని అనుకున్నా. కానీ, నా వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదు. నా పర్యటన సాయపడేలా ఉండాలే తప్ప అధికారులపై అదనపు భారం కాకూడదు. నేను రాలేదని కొందరు నిందలు వేస్తారు. అంతే తప్ప ఇంకేమీ ఉండదు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవే ముఖ్యం అని పవన్ చెప్పారు.

People making shocking comments on Pawan Kalyan who did not visit AP flood areas
People making shocking comments on Pawan Kalyan who did not visit AP flood areas

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతను మర్చిపోవద్దు..

అయితే పవన్ ఇచ్చినా స్టేట్ మెంట్ పై మళ్లీ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాధ్యత అనేది సక్రమంగా నెరవేర్చాలి. ఇలాంటి సాకులు చెప్పడం ఏంటని కొందరు రాజకీయ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. అటు వైసీపీ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ తీరు పై చురకలు అంటిస్తున్నారు.. ప్రజాదరణ రెస్క్యూ ఆపరేషన్‌లకు ఆటంకం కలిగిస్తుందన్న అతని సాకు ఆమోదయోగ్యం కాదు. స్టార్‌డమ్‌లో, ప్రజాసేవలో తాను ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌లకు మించినది కాదని పవన్‌కళ్యాణ్‌ గుర్తించాల్సిన సమయం ఇది. ఉపముఖ్యమంత్రిగా ప్రజల కనీస అంచనాలను నెరవేర్చి, సంక్షోభ సమయంలో నిజమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలి. తాను సేవ చేస్తున్న పౌరుల శ్రేయస్సు కోసం తాను నిజంగా అంకితభావంతో ఉన్నానని పవన్ కళ్యాణ్ నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పటికైనా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శిస్తే బాగుండునని కోరుకుంటున్నారు.. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు