The GOAT : విజయ్ గోట్ మూవీలో ఆ హీరోయిన్.. ఆ రూమర్స్ నిజం అయ్యాయిగా..

The GOAT : కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) దళపతి లేటెస్ట్ మూవీ ‘ది గోట్’.. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ చివరి సినిమాగా వచ్చిన సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని తెలుస్తుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాలో విజయ్ లుక్ డిఫరెంట్ గా ఉండటంతో ఫ్యాన్స్ సినిమా పై ఆసక్తిని చూపిస్తున్నారు.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ( Meenakshi Chowdary) హీరోయిన్‌గా నటించింది. వెంకట్ ప్రభు ( Venkat Prabhu) దర్శకత్వంలో సినిమా తెరకేక్కింది. ఈ సినిమా మొత్తం కొత్తగా ఉండటమే కాదు విజయ్ ను ఎప్పుడూ చూడని విధంగా ఉందని పబ్లిక్ రివ్యులు ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈయనకు, స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) కు ఎఫైర్ నడుస్తుందని, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు ఇద్దరు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఫ్యాన్స్ కు మాత్రం ఎక్కడో అనుమానం ఉండేది. ఈరోజు అది నిజం అని తేలిపోయింది. విజయ్ లేటెస్ట్ మూవీ గోట్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకోవడంతో పాటుగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ మూవీలో ఓ సాంగ్ లో హీరోయిన్ త్రిష డ్యాన్స్ చేసింది. వీరిద్దరూ డ్యాన్స్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు నిజమే అని దీంతో రుజువైంది..

The heroine in Vijay's Goat movie..
The heroine in Vijay’s Goat movie..

ఇకపోతే విజయ్ ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. డ్యూయల్ రోల్లో బైక్ పై విజయ్ యాక్షన్​ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. యువన్ శంకర్ రాజా (Yuvan Sankar Raja) సంగీతం అందించారు.. సినిమాకు ఈయన మ్యూజిక్ బ్యాక్ బోన్ అయ్యింది. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో జయరామ్ (Jayaram), స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

The heroine in Vijay's Goat movie..
The heroine in Vijay’s Goat movie..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు