Biggboss8 : కొడుకు గురించి ఆదిత్య ఓం ఇంట్రెస్టింగ్ కామెంట్స్… తన వరెస్ట్ క్రిటిక్ అంటూ!

Bigg Boss8 : బుల్లితెర ప్రియులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ 1న ప్రారంభమైందన్న సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే ఈ సీజన్ కి కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రియాలిటీ షో లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో పలు టీవీ సీరియల్స్ నటులు, సినిమా నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ కంటెస్టెంట్స్ లో ఆడియన్స్ కి బాగా తెలిసిన వ్యక్తుల్లో ఒకరు “ఆదిత్య ఓం” (Aditya Om). రెండు దశాబ్దాల కింద తెలుగులో “లాహిరి లాహిరి లాహిరిలో” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం కెరీర్ బిగినింగ్ లో హీరోగా వరుస సినిమాలు చేసాడు. కానీ ఆ తరువాత వరుస పరాజయాలతో ఫేడవుట్ అయ్యాడు. రీసెంట్ గా దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు చేసినా క్లిక్ అవలేదు. ఇప్పుడు తనని తాను నిరూపించుకునేందుకు మళ్ళీ ఆడియన్స్ కి దగ్గరయ్యేందుకు బిగ్ బాస్ 8 హౌస్ లోకి అడుగుపెట్టాడు.

Aditya Om interesting comments about his son in Biggboss8 house

కొడుకు గురించి ఆదిత్య ఓం మాటల్లో.. వరస్ట్ క్రిటిక్ అంటూ..

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం తన సెటిల్ అయిన ఆట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తొలిరోజు కాస్త సైలెంట్ గా ఉన్నా, ఇప్పుడు హౌస్ మేట్స్ అందరితో మాటలు కలుపుతూ.. పికప్ అవుతున్నాడు. ఇదిలా ఉండగా నామినేషన్స్ పూర్తయ్యాక బాల్కనీ లో నాగమణికంఠ (Nagamanikantha) తో కూర్చున్న ఆదిత్య, ఓ సందర్భంలో తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నాగమణికంఠ బిగ్ బాస్ లో ఆట ఆది వెళ్లిన తర్వాత మీ బాబు ఎంత హ్యాపీగా ఫీలవుతాడో అని అంటాడు. దానికి ఆదిత్య ఓం రిప్లై ఇస్తూ.. తన బాబు ముందునుండి కొంత డిస్టెన్స్ గా ఉంటాడని, నాకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉందని చెప్పుకొచ్చాడు. దేన్నైనా చాలా న్యూట్రల్ గా చూస్తాడని, తనకు వరెస్ట్ క్రిటిక్ తన కొడుకే అని ఆదిత్య ఓం చెప్పుకొచ్చాడు. ఈ మధ్య తాను చేసిన ఓ సినిమా గురించి అందరికంటే తన కొడుకు ఎక్కువగా క్లాస్ పీకాడని ఆదిత్య ఓం చెప్పుకొచ్చాడు.

- Advertisement -

హౌస్ లో డీసెంట్ ప్లేయర్…

అయితే ఆదిత్య ఓం తన ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో పెద్దగా ఎప్పుడూ రివీల్ చేయలేదు. బహుశా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక తానే తొందర్లో చూపించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ (Biggboss8) లో మాత్రం ఆదిత్య ఓం డీసెంట్ ప్లేయర్ గా నిలుస్తున్నాడు. అయితే ఆడియన్స్ దృష్టి తనపై పడాలంటే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదో ఒక రియాక్షన్ ఉండాలని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరు వెళ్తారో అని నెట్టింట చర్చ నడుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు