Pranitha Subhash: రెండో బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత..!

Pranitha Subhash.. తెలుగులో తనీష్ హీరోగా నటించిన ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రం ద్వారా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ బ్యూటీ ప్రణీత సుభాష్ (Pranitha Subhas) మరొకసారి బావ సినిమాలో సిద్ధార్థ్ సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో మెప్పించిన ఈమె, తన అందచందాలతో నటనతో పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ఇకపోతే స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది కానీ సెకండ్ హీరోయిన్ గా మాత్రం నటిస్తూ కెరియర్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Pranitha Subhash: Pranitha gave birth to her second child..!
Pranitha Subhash: Pranitha gave birth to her second child..!

రెండవసారి గర్భం దాల్చిన ప్రణీత..

ఇకపోతే వరుస సినిమాలలో నటిస్తున్నప్పుడే బెంగళూరుకు చెందిన తన స్నేహితుడు నితిన్ రాజుని వివాహం చేసుకున్న ఈమె, కొన్ని నెలల క్రితమే ఒక పాపకు జన్మనిచ్చింది. పాప ఆలనా పాలన చూసుకోవడం కోసం ఇండస్ట్రీకి దూరమైన ప్రణీత సుభాష్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై పలు షోలలో సందడి చేసింది. కన్నడలో అడపాదడపా చిత్రాలలో కూడా నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెండోసారి గర్భవతి అయ్యాను అంటూ అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్ తో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ నేను మళ్ళీ గర్భం దాల్చాను అంటూ అభిమానులతో చెప్పుకొచ్చింది.

మగ బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత..

అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి తల్లి అయ్యింది ప్రణీత సుభాష్ . పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో ఉన్న ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్స్, సెలబ్రిటీలు కూడా ప్రణీత సుభాష్ , నితిన్ రాజు దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. బేబీ బంప్ ఫోటోలతో పాటు బిడ్డ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. .

- Advertisement -

వైద్యుల కుటుంబం..

ప్రణీత సుభాష్ బాల్యం, కుటుంబం విషయానికి వస్తే.. 1992 అక్టోబర్ 17వ తేదీన బెంగళూరులో ఒక వైద్యుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి డాక్టర్ కాగా తల్లి కూడా గైనకాలజిస్ట్. ఈమె తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. ఆర్యన్ ప్రెసిడెన్సీ పాఠశాలల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత బెంగళూరు విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో జాయిన్ అయ్యింది. అయితే మోడలింగ్ , సినిమా రంగంలో కెరియర్ కొనసాగించాలనుకున్న ఈమె చదువును మధ్యలోనే వదిలేసింది. ఒక 2010లో ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద , రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే ఇలా పలు చిత్రాలలో నటించింది.

ప్రణీత వైవాహిక జీవితం..

ఇక ప్రణీత వైవాహిక జీవిత విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈమె 2021 మే 30వ తేదీన నితిన్ రాజును వివాహం చేసుకుంది . 2022 జూన్ 10న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఇప్పుడు 2024 సెప్టెంబర్ 5వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మొత్తానికైతే ఇద్దరు పిల్లలకు తల్లి అయిపోయింది ప్రణీత సుభాష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు