Prasanth Varma: నందమూరి వారసుడు అఫీషియల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది

Prasanth Varma: ఆ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. అయితే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదని చాలామంది అనుకుంటారు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అని రీసెంట్ గా హనుమాన్ సినిమాలు సంబంధించిన సినిమా ఈవెంట్లో ప్రశాంత్ వర్మ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ సినిమా వల్ల నిర్మాత నాని ఎంత హ్యాపీగా ఉన్నాడో కూడా ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెలిపాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా కల్కి(Kalki). బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన సినిమా హనుమాన్.

తేజ హీరోగా నటించిన ఈ సినిమాకి మొదట థియేటర్లు దొరకలేదు. కానీ మెల్లగా ఈ సినిమా మౌత్ టాక్ తో మంచి హిట్ గా మారి చాలా థియేటర్లను దక్కించుకుంది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తేజ సజ్జా(Teja Sajja) లాంటి హీరోతో ఇన్ని కోట్లు రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడితో పాన్ ఇండియా హీరో అయిపోయాడు తేజ. ఉన్నట్టుండి ప్రశాంత్ వర్మ కూడా వేరే రేంజ్ లో రేంజ్ పెరిగిపోయింది. ప్రశాంత్ సినీమాటిక్ యూనివర్స్ అంటూ తెలుగులో కూడా మొదలుపెట్టాడు. ప్రస్తుతం నందమూరి వారసుడు ఎంట్రీ బాధ్యతలు తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ.

Balakrishna's son Mokshagna Teja's

- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎంతోమంది క్యూరియాసిటీతో ఎదురు చూశారు. అయితే పలు ఈవెంట్స్ లో నందమూరి వారసుడు మోక్షజ్ఞ చాలా లావుగా కనిపిస్తూ ఉండేవాడు. దీనితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మోక్షజ్ఞ ఎంట్రీ అవ్వదు అని అందరు అనుకున్నారు. ఇకపోతే రీసెంట్ గా చాలా స్లిమ్ గా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నందమూరి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ వర్మ సినిమా చేస్తాడు అని పలు రకాల వార్తలు వినిపించాయి ఎట్టకేలకు దాని గురించి అధికారిక ప్రకటన నేటికీ వచ్చేసింది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshajna) హీరోగా పరిచయమవుతున్నాడు. దీనికి సింబా అనే టైటిల్ ఖరారు చేశారు. సింబా అనేది ఎంత పెద్ద పవర్ఫుల్ టైటిల్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సింహ అంటే నందమూరి బాలకృష్ణ కి బాగా కలిసి వచ్చిన పేరు. మామూలుగా సింహం యొక్క పిల్లలను సింబా అని చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు మోక్షజ్ఞ పరిచయమవుతున్న సినిమా పేరుకి సింబా అని పెట్టడం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇక ఈ నందమూరి వారసుడు తెలుగు సినిమా చరిత్రలో ఎలా నిలబడతాడు తెలియాలి అంటే ఇంకొంత కాలం వేచి చూడకు తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు