16YearsOfNaniInTFI: మన ఇంట్లో వాడు ఇండస్ట్రీకి వెళ్ళి 16 ఏళ్ళు అయింది

16YearsOfNaniInTFI: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో ఐదు నుంచి ఆరు సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. రీసెంట్ టైమ్స్ లో చిన్న కాన్సెప్ట్ సినిమాలకి మంచి ఆదరణ దక్కుతుంది. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకునే నటులు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి అతి తక్కువ మంది నటులలో న్యాచురల్ స్టార్ నాని ఒకడు.

ప్రముఖ దర్శకులు బాపు గారి దగ్గర శిష్యరికం చేసిన నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అష్టా చమ్మ సినిమాతో నటుడుగా అడుగులు వేశారు. నాని చేసిన అలా మొదలైంది సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పిల్ల జమిందార్(Pilla Zamindhar), ఈగ(Eega), ఎవడే సుబ్రహ్మణ్యం(Yevade Subramanyam) వంటి సినిమాలు నానిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఒకవైపు కాన్సెప్ట్ బేసిక్ సినిమాలు చేస్తూ ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి లవ్ స్టోరీ సినిమాలు కూడా చేశాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు నాని. నాని తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా బెస్ట్ పర్ఫామెన్స్ అని మాట్లాడుకుంటే జెర్సీ సినిమా ప్రస్తావన వస్తుంది.

Ashta Chamma

- Advertisement -

జెర్సీ సినిమా తర్వాత నాని(Naani) కథలను ఎంచుకునే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. ఒకవైపు మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ, మరోవైపు హాయ్ నాన్నా వంటి డీసెంట్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నాడు. నాని సినిమా అంటే కొత్తదనం ఉంటుంది అని ఏమీ ఆలోచించకుండా థియేటర్ కి వెళ్లిపోయి ఆడియన్స్ ఉన్నారు. ఇక రీసెంట్ గా కొత్త దర్శకులను పరిచయం చేస్తూ ఒకవైపు వాళ్ళకి కమర్షియల్ హిట్స్ అందిస్తూ మరోవైపు అవార్డ్స్ కూడా వచ్చేలా చేస్తున్నాడు నాని. ఇక నాని విషయానికొస్తే రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా అంతమందితో కలిసి పోతాడు. ఇక నానిని చూస్తే తెలుగు ప్రేక్షకులకు మన ఇంట్లో ఒక కుర్రోడులా అనిపిస్తాడు.

అందరి హీరోల కాకుండా ప్రతి సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలా ప్లాన్ చేసుకుంటున్నాడు నాని. క్వాంటిటీ తో పాటు అద్భుతమైన క్వాలిటీ ఉన్న ఫిలిమ్స్ కూడా చేస్తున్నాడు అని ఒప్పుకుని తీరాల్సిందే. అష్ట చమ్మతో ఎంట్రీ ఇచ్చిన నాని నేటికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ పదహారేళ్లలో వివాదాలకు దూరంగా విజయాలకు చేరువుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు మన ఇంట్లో ఒక కుర్రోడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు