Soumya: ప్రైవేట్ పార్ట్ లో రా*డ్డు పెట్టి.. ఆ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Soumya.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హేమా కమిటీ రిపోర్టు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చాలామంది ఆడవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు అంటూ హేమ నివేదికలో వెల్లడయ్యింది.. ఎప్పుడైతే ఈ నివేదిక బయటకు వచ్చిందో అప్పుడు ప్రతి ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీమణులు తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మీడియాతో చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పలు ఇండస్ట్రీలకు చెందిన మహిళలు ఇలా లైంగిక వేధింపుల గురించి చెప్పడం సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

Soumya: iron rod put in private part.. Shocking comments on that director went viral..!
Soumya: iron rod put in private part.. Shocking comments on that director went viral..!

హేమా కమిటీలో విస్తుపోయే నిజాలు..

ఒకపక్క హేమా కమిటీ రిపోర్టులో వెళ్లడైన అంశాలు బయటకు రావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలలో కల్లోలం ఏర్పడింది. ఇదే మంచి సమయం అనుకొని తమిళ ఇండస్ట్రీ వారు కూడా ఒక్కొక్కరిగా బయటకొచ్చి తమకు జరిగిన లైంగిక వేధింపులను బయట పెడుతున్నారు. అందులో భాగంగానే ఒక సీనియర్ తమిళ నటి సౌమ్య కూడా ఒక దర్శకుడు చేసిన దారుణాన్ని నిర్భయంగా మీడియా ముందు బయటపెట్టింది.

నటిపై కర్కశంగా ప్రవర్తించిన డైరెక్టర్..

సౌమ్య మాట్లాడుతూ.. నాకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక డైరెక్టర్ నన్ను ఒక సినిమా కోసం కలిశాడు. ఆ రోజు నన్ను మెంటల్ టార్చర్ పెట్టాడు. నాతో ఒక బిడ్డను కణాలని కూడా చూశాడు. అక్కడితో ఆగకుండా నా యోనిలో రాడ్ పెట్టి శునకానందం పొందాడు. ఒకవేళ పోలీసులు నా కేసును టేకప్ చేస్తేనే ఆ దర్శకుడి పేరు, వివరాలు బయట పెడతాను అంటూ ఆ నటి చెప్పుకొచ్చింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు కాలేజీలో జరిగిన ఒక డ్రామాలో నేను నటించాను. అయితే అది నాకు చిత్ర పరిశ్రమలో నటించే అవకాశాన్ని అందించింది. మాది చాలా చిన్న కుటుంబం, నా తల్లిదండ్రులే నా ప్రపంచం. అయితే నా తల్లిదండ్రులకు సినిమా ప్రపంచం గురించి తెలియదు. ఆ సమయంలో మా ఇంటికి ఒక వీధి అవతల సీనియర్ నటి రేవతి కూడా ఉండేవారు. ఆమెను నేను ఎంతో ఇష్టపడేదాన్ని. సినిమాల్లో అవకాశం మనగానే రంగుల ప్రపంచం అని ఊహించుకున్నాను.

- Advertisement -

ఏడాది పాటు అత్యాచారం చేశారు..

అందులో భాగంగానే మొదటి ఆడిషన్ కోసం వెళ్తే ఆడిషన్ సమయంలోనే నా చేత తప్పుడు పనులు చేయిస్తున్నారని నాకు అర్థం అయింది. దాంతో సినిమా చెయ్యను అని చెప్పేసాను. కానీ ఆ దర్శకుడు తన భార్యను మా ఇంటికి పంపి, మీ అమ్మాయి పై చాలా డబ్బు ఖర్చు పెట్టాము.ఇప్పుడేమో నటించను అంటోంది అంటూ నా తల్లిదండ్రుల దగ్గర నా గురించి లేనిపోని అబద్ధాలు చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇక వారికి ఇష్టం లేకపోయినా నన్ను సినిమాల్లోకి పంపించేశారు. డాక్యుమెంట్లో మాత్రం అతడి భార్య సినిమాను డైరెక్ట్ చేస్తారు అని ఉంది. కానీ సెట్లో మాత్రం అతడే డైరెక్ట్ చేసేవాడు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నట్లు నటించి, ఇంటికి తీసుకెళ్ళి తినడానికి పెట్టి.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా దాదాపు ఏడాది పాటు నాపై అత్యాచారానికి పాల్పడుతూనే వచ్చాడు. ఇక ఈ దారుణ ఘటన నుంచి కోలుకోవడానికి నాకు 30 సంవత్సరాలు సమయం పట్టింది. నాలాగే ఇలాంటి దారుణాలకు గురైన వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికైనా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాను అంటూ సౌమ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు