The Goat : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ( Vijay Thalapathy) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సౌత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న యాక్టర్స్ లో ఈయన ఒకరు. రీజనల్ సినిమాతోనే అలవోకగా రూ.250 కోట్లు కలెక్ట్ చేస్తూ ఉంటాడు. మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా హిట్లు, బ్లాక్ బస్టర్స్ అందుకుంటూనే రాజకీయ రంగ ప్రవేశం కూడా చేస్తున్నాడు. అయితే ఈయన ఈ మధ్య నటించిన ప్రతి సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంటున్నాయి. కానీ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇక రెమ్యూనరేషన్ కూడా షాక్ ఇచ్చే రేంజులో ఉందనే విషయం చెప్పనక్కర్లేదు. తాజాగా ఈయన రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
విజయ్ దళపతి రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గేదేలే అని అందరికి తెలుసు.. ప్రతి సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. తాజాగా తలపతి విజయ్ ‘గోట్’ (The Goat) మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్ వింటే కచ్చితంగా దిమ్మతిరగాల్సిందే.. ఆ సినిమా బడ్జెట్ లో సగం ఆయన రెమ్యూరేషనేనంట. ఇంతకీ ఎన్ని కోట్లు తీసుకున్నాడో ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..
విజయ్ గతేడాది దళపతి నటించిన లియో (Leo) మూవీ తో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడంతో కోలివుడ్ టాప్ హీరో గా మారారు. దీంతో విజయ్ దళపతి తాజాగా నటిస్తున్న చిత్రం గోట్. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ మూవీలో విజయ్ డూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్డెట్ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి రూ. 400 కోట్ల వరకు బడ్జెట్ ను పెట్టారు. ప్రస్తుతం సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంటుంది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ. 250 కోట్లు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు సెలెబ్రేటిలలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ప్రభాస్ పేర్లు వినిపించేవి. రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. కానీ దళపతి విజయ్ గోట్ మూవీలో నటించడానికి ఏకంగా రూ. 250 కోట్ల పారితోషికం తీసుకున్నారని, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా విజయ్ నిలిచారు.. ఇక ముందు సినిమాలు తియ్యబోరని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు..