OTT Movie : పోలీసులకి చుక్కలు చూపించే ఖతర్నాక్ క్రైమ్ థ్రిల్లర్… ఏకంగా రాష్ట్రాన్నే వణికించిన స్టోరీ

OTT Movie : రాను రాను సినిమాల కంటే వెబ్ సిరీస్ లపై ఓటిటి మూవీ లవర్స్ కి ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఇటీవల కాలంలో సినిమాలు కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ల కోసమే సెర్చ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త వెబ్ సిరీస్ లను అప్డేట్ గా ఉంటూ ప్రేక్షకులు మిస్ కాకుండా చూస్తున్నారు. అయితే పాత వాటిపై కూడా మర్చిపోకుండా ఓ లుక్కెయ్యండి అంటూ ఓటీటీ లు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లను సజెస్ట్ చేస్తున్నాయి. ఇలాంటి సజెషన్స్ లో మూవీ లవర్స్ ఎక్కువగా చూడడానికి ఇష్టపడేది సినిమాల పరంగా అయితే హర్రర్ మూవీస్. అదే వెబ్ సిరీస్ పరంగా చూసుకుంటే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లే లిస్టులో ముందు వరుసలో ఉంటాయి. ఈరోజు ఈ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను, సిరీస్ లను ఇష్టపడే మూవీ లవర్స్ కోసమే ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను మన సజెషన్ లో తీసుకొచ్చాము.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ వెబ్ సిరీస్ లో వున్న స్టోరీలో అప్పట్లో ఒకటి 7 హత్యలు, 7 సంవత్సరాల పాటు ఎవ్వరూ పరిష్కరించలేకపోయిన స్టోరీని చూపించారు. ఆ కేసు పోలీసులకు చుక్కలు చూపించింది. ఏళ్లపాటు కొనసాగి కొత్త అనుమానాలు లేవానేత్తేలా చేసింది. అంతే కాకుండా అప్పట్లో మహారాష్ట్రను వణికించిన దారుణమైన క్రైమ్ ఆధారంగా తెరకెక్కింది ఈ సిరీస్. ఇక తాజాగా సోనీ లైవ్ దీనికి సంబంధించిన అప్డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సిరీస్ పేరు మన్వత్ మర్డర్స్. కాగా అక్టోబర్ 4 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లను ఇష్టపడే వారికి ఈ సిరీస్ స్పెషల్ కాబోతోంది.

Mistry Behind 'Manwath Murders' Case : ४ ऑक्टोबरला येणारी 'मानवत हत्याकांड' वेबसिरिज नेमकी आहे तरी काय ?

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఓపెన్ చేస్తే ఒక ఊర్లోని మర్రి చెట్టు కింద క్షుద్ర పూజలు జరుగుతాయి. మరోవైపు ఆడపిల్లలను మాత్రమే ఎత్తుకెళ్లి ఎవరో చంపేస్తారు. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళలు నలుగురు ఆడపిల్లలు హత్యకు గురవుతారు. స్థానిక పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినా ఏమి కనుక్కోలేక చేతులెత్తేస్తారు. ఆధారాలు దొరక్కపోవడంతో అసలు ఈ హత్యలను ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలీక తలలు పట్టుకుంటారు. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి పోలీసులు ఈ కేసును ఇన్వెస్ట్ చేయడానికి రంగంలోకి దిగుతారు. మరి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? అసలు ఎవరు ఇలా అమ్మాయిలను వరుసగా హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? అనే విషయాలను పోలీసులు కనిపెట్టారా? 7 మర్డర్స్ జరిగేదాక పోలీసులు ఎందుకు ఆపలేకపోపోయారు ? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ మనవత్ మర్డర్స్ మిస్టరీ వెబ్ సిరీస్ ను చూస్తేనే తెలుస్తుంది. అయితే ఈ సిరీస్ రిలీజ్ కావడానికి సోనీ లివ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం ఇంకా ఓనెల టైం పడుతుంది. కాబట్టి సిరీస్ ను చూడాలంటే వచ్చే నెల దాకా ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు