OTT Movie : మోస్ట్ వయోలెంట్ బో*ల్డ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : కొన్ని సినిమాలను ఓటీటీలో చూస్తే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి గానీ థియేటర్లలో చూస్తే మాత్రం తెగ బోర్ కొడుతుంది. అలాగే మరికొన్ని సినిమాలకు ఎంత భారీ బడ్జెట్ల వున్నా స్టార్ కాస్టింగ్ ఉన్నా మూవీ లవర్స్ పెద్దగా పట్టించుకోరు. ఇలా థియేటర్ల వద్ద డిజాస్టర్ అయిన ఆ సినిమాలు డిజిటల్ గా రిలీజ్ అయితే మాత్రం డిఫరెంట్ రెస్పాన్స్ వస్తుంది. ఓటిటిలో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తాయి. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఓటిటిలో అయినా బాగా ఆడతాయేమో అనే ఆశతో ఉంటారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీకి బాక్స్ ఆఫీస్ తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలో కూడా ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఏకంగా ఈ సినిమాను ఫ్రీగా స్ట్రీమింగ్ చేయాల్సి వచ్చింది మేకర్స్.

ఈ బో*ల్డ్ మూవీని ఫ్రీగా చూడొచ్చు…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీ హిందీ సినిమా. దాదాపు 45 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కిడ్  అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ హీరో హీరోయిన్లుగా నటించారు. నవంబర్లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ పరంగా ఊహించని దెబ్బ పడింది. ముందుగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. కానీ డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ దీని గురించి పట్టించుకోలేదు.  ఏ ఓటిటి ఈ మూవీని కొనక పోవడంతో చేసేదిలేక డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇక యూట్యూబ్ లో ఈ సినిమాను ఫ్రీగా చూసే ఛాన్స్ ఉంది. కాబట్టి అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎందుకు ప్రేక్షకులు ఇంత దారుణంగా ఈ మూవీని రిజెక్ట్ చేశారు? అనే విషయాలను తెలుసుకుందాం.

'The Lady Killer' trailer out.

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ది లేడీ కిల్లర్. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో హీరోయిన్ హత్యలు చేస్తుంది. ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి కాబట్టి సింగిల్ గా చూస్తే బెటర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చి రెండు రోజులైనప్పటికీ ఈ సినిమాకు కేవలం నాలుగు లక్షల వ్యూస్ మాత్రమే రావడం విశేషం.

లేడీ కిల్లర్ అనేది గందరగోళంలో చిక్కుకున్న ఒక వ్యక్తి కథ. రాజేందర్ జోషి (అర్జున్ కపూర్) నైనిటాల్‌లో కెమిస్ట్ షాప్ నడుపుతాడు. అతను డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటాడు. కానీ అతను డిఫాల్టర్ కావడంతో బ్యాంకు అతనికి లోన ఇవ్వదు. మరోవైపు అతను గజ్రా (ప్రియాంక బోస్) అనే పెళ్ళయిన అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. ఒకరోజు ఫ్రెండ్ సలహా మేరకు తన బిజినెస్ కోసం విక్రమ్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్ళి అక్కడ అతని కూతురు జాన్సీకి అట్రాక్ట్ అవుతాడు. అతను జాన్సీని వేధిస్తున్నాడు అని తెలుసుకుని ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేస్తారు. చివరికి ఏం జరిగినది అనేదే స్టోరీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు