Biggboss8 : సోనియా తనను తాను ఆడపులి అనుకుంటే సరిపోతుందా.. ఆడియన్స్ కాదా చెప్పాలి..

Biggboss8 : బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 8 మంచి వ్యూయర్షిప్ తో దూసుకుపోతుంది. ఏడేళ్లుగా ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో 8వ సీజన్ సెప్టెంబర్ 1న మొదలై బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇక కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో 14 మంది కంటెస్టెంట్స్ తమ తమ ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చిన రెండో రోజే బిగ్ బాస్ లో చీఫ్ టాస్క్ లు పెట్టగా అందులో ముగ్గురు చీఫ్ లుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నిఖిల్ (Nikhil), నైనిక, యష్మి గౌడ హౌస్ చీఫ్ లుగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా ఈ హౌస్ లో చీఫ్ లుగా ఉన్న ఈ ముగ్గురిని బలోపేతం చేసేందుకు చీఫ్స్ వాళ్ళ క్లాన్ ని నిర్మించునేందుకు బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ని పెట్టాడు.

Sonia Interesting Comments on Biggboss8 House

ఒక్కటిగా మిగిలిన సోనియా..

ఇకపోతే బిగ్ బాస్ (Biggboss8) పెట్టిన టాస్క్ లో హౌస్ లో చీఫ్ లుగా యష్మి గౌడ, నైనికా టీం లో చెరో నలుగురు చేరగా, నిఖిల్ టీం లో ఇద్దరు చేరిపోయారు. అయితే చివరి కంటెస్టెంట్ గా సోనియా (Soniya) మిగిలిపోవడంతో యష్మి, నైనికా టీమ్స్ ఫుల్ అయిన కారణంగా బిగ్ బాస్ నిఖిల్ టీం లో చేరాల్సింది గా చెప్పడం జరిగింది. దానికి సోనియా కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇదిలా ఉండగా టీమ్ లో చేరేముందు ఎందుకు చేరుతున్నారో చెప్పాలి కాబట్టి, సోనియా నిఖిల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు నిఖిల్ తో ఫైట్ బాగనిపిస్తుంది, పైగా తనలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయని అంటూ, తాను మనసుల్ని గెలుచుకుంటాడా లేదా అని చూడాలి.. అయితే అది తనతోనే పాజిబుల్ అవుతుందని, ఈ ఆడపులితో ఫైట్ చేస్తేనే అది కుదురుతుందని, ఎందుకంటే తాను ఇద్దరితో సమానం అని తనకి తానే లేపుకుంది.

- Advertisement -

తనకు తాను ఆడపులి అనుకుంటే సరిపోతుందా..

అయితే సోనియా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తనకు తాను ఆడపులి గా ప్రమోట్ చేసుకుంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు కూడాను నాగార్జునకి ఆడపులిగానే పరిచయం చేసుకుంది. హౌస్ లో కూడా కొన్ని సార్లు అసందర్భంగా చోట కూడా ఆడపులి అంటూ తనని తాను లేపుకుని ప్రయత్నం చేస్తుంది చేస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే తన ఆట తీరు నచ్చి ఆడియన్స్ చెప్పాలి ఆడపులి అని గాని, తనకు తాను ఆడపులి అనుకోవడమేంటి అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఇకపోతే హౌస్ లో కూడా సోనియా కొన్ని సార్లు హైపర్ అవుతుంది. మరి తన ఆట తీరుతో సోనియా ఆడపులి అని నిరూపించుకుంటుందా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు