SJ Suryah: ఎస్.జే సూర్య చెంప చెల్లుమనిపించిన కమెడియన్.. ఇదిగో ప్రూఫ్..

SJ Surya: ఎస్.జే సూర్య.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. నటుడుగా, డైరెక్టర్ గా, విలన్ గా ఎన్నో సినిమాలు చేశాడు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలను డైరెక్ట్ చేసిన ఈయన ఇప్పుడు విలన్ గా చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇటీవల ఈయన చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్ లో ఎస్ జే సూర్య (SJ Suryah) ఒకరు. రీసెంట్ గా ఈయన సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. సినిమా మొత్తానికి ఈయన పాత్రే హైలెట్ గా నిలిచింది. తాజాగా ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

సరిపోదా శనివారం ( Sarioda Sanivaram ) సినిమా చూసిన తర్వాత అందరూ ఎస్ జే సూర్య నటన గురించే మాట్లాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఎస్ జే సూర్య నాని ని కూడా డామినేట్ చేసాడు. నానినే ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు. తాజాగా సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో SJ సూర్య మాట్లాడుతూ షూటింగ్ లో జరిగిన ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు, కమెడియన్ శివాజీ రాజా (Sivaji Raja) కూడా నటించారు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో విలన్ ను శివాజీ చెంప దెబ్బ కొట్టే సీన్ ఉంటుంది. ఇదే అక్కడే టచింగ్ సీన్ అయ్యింది.

The comedian who beat SJ Surya .. the villain who gave clarity
The comedian who beat SJ Surya .. the villain who gave clarity

అయితే నిన్న సక్సెస్ మీట్ లో దీని గురించి ఎస్జే సూర్య మాట్లాడారు. ఈ సినిమాలో శివాజీ రాజా చేతిలో చెంప దెబ్బ తినే సీన్ ఉంటుంది. ముందు మామూలుగానే ఊరికే కొట్టినట్టు కనిపించేలా తీశారు. కానీ సరిగ్గా రాలేదని డైరెక్టర్ వివేక్ (Vivek ) వచ్చి నిజంగా దెబ్బలు తినగలరా అని అడిగారు, నేను ఓకే అన్నాను. శివాజీ రాజా గారిని నేనే పిలిచి గట్టిగానే కొట్టండి సర్ పర్లేదు చెప్పాను. ఆయన సీన్ కోసం ఓకే అన్నాడు. అయితే షూట్ టైం లో ఆయన కొట్టిన దెబ్బతో నాకు తెరుకోవడానికి కాస్త సమయం పట్టింది. అంత గట్టిగా కొట్టారు. ఒకసారి చెయ్యి చూపించండి అని ఆయనను అడిగితే నేను కరాటేలో బ్రౌన్ బెల్ట్ అన్నారు. ఇది ముందే చెప్పొచ్చు కదా సర్ అని అడిగాను. మళ్ళీ రీ టేక్ తీసుకొని ఇంకోసారి కూడా కొట్టించుకున్నాను. నాకు ఈ పాత్ర అంత నచ్చి, మీకు నా బెస్ట్ ఇవ్వడానికి నిజంగా కొట్టించుకున్నాను. సినిమాలో ఇంకా కొన్ని సీన్స్ లో కూడా నిజంగా కొట్టించుకున్నాను అని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే శివాజీ రాజాకు సినిమా అంటే ఎంత డెడికేషన్ అనేది తెలుస్తుంది. అందుకే హీరోలను డామినేట్ చేసే విలన్ అయ్యాడు. ఇక ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు