Star Heroine: వ్య*భి*చా*ర రొంపులో పడి.. 33 ఏళ్లకే మృతి చెందిన స్టార్ హీరోయిన్..

Star Heroine.. ఒక స్టార్ హీరోయిన్ విషయంలో యాదృచ్ఛికంగా అలా జరిగిందో లేక డబ్బుకోసం కొంతమంది వ్యభిచారం అని ఊబిలోకి ఈమెను దింపారో తెలియదు కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యి , ఆ తర్వాత వ్యభిచారం అనే రొంపులోకి లోకి దిగి , మద్యానికి బానిసై..33 ఏళ్లకే స్వర్గస్తురాలు అయ్యింది. మరి ఆమె ఎవరు ఆమె నేపథ్యం ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Star Heroine: Star Heroine who died at the age of 33 after falling into an affair.
Star Heroine: Star Heroine who died at the age of 33 after falling into an affair.

60 , 70 లలో స్టార్ హీరోయిన్..

ఈమె ఒక బాలీవుడ్ నటి.. 60,70 సంవత్సరాల కాలంలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. స్టార్ హీరోయిన్గా చలామణి అయింది. ఆమె ఎవరో కాదు విమీ. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే కొంతమందితో విభేదాల కారణంగా.. వ్యక్తిగత, వృత్తిపరమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది విమి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని పూర్తిస్థాయిలో నష్టపోయింది. చూడడానికి చాలా అందంగా, క్యూట్ గా ఉండే ఈమె విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వేలకు వేలు సంపాదించింది. కానీ కొన్నేళ్లకే తన సినీ కెరియర్ ను ముగించి, వ్యభిచారం లాంటి రొంపులోకి కూరుకుపోయేంతలా తన జీవితం నాశనం అయిపోయింది . కేవలం 33 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలికిన ఈమె శవాన్ని కూడా మోసేందుకు నలుగురు లేకుండా పోయారు.

తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి.. అత్తమామలు గెంటేయడంతో..

1943 పంజాబ్లోని జలంధర్ లో జన్మించిన ఈమె, చిన్న వయసులోనే ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు శివ అగర్వాల్ ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి విమీ తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇక పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తన భర్తతో కలకత్తాలో ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, ఈమెను సంగీత దర్శకుడు రవి చూసి విమి అందానికి ఫిదా అయిపోయారు. నువ్వు సినిమాల్లో ఎందుకు పనిచేయకూడదు అని ఆమెతో అన్నారు. నేను ఇద్దరు పిల్లలకు తల్లి, ఇప్పుడెలా అవకాశాలు ఇస్తారు అంటూ ప్రశ్నించింది విమి. వఆమె భర్త ఆయన శివను ముంబైకి పిలిపించి.. ఆపై బిఆర్ చోప్రాన కలిసేలా చేశారట రవి.. అలా బీఆర్ చోప్రా తన మొదటి చిత్రం హమ్ రాజ్ సినిమాలో విమీకి అవకాశం లభించింది. అయితే ఆ సమయంలో విమి అత్తమామలకు కూడా ఆమె నటించడం ఇష్టం లేదు. కానీ భర్త నుండి మద్దతు లభించింది. అత్తమామల మాట వినకపోవడంతో ఆమెను ఇంటి నుంచి గెంటేసారు ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు. భర్త పిల్లలకు తో బయటకొచ్చిన విమి.. ఇంటి నిర్వహణ బాధ్యత అంటూ భుజస్కందాలపై వేసుకుంది.

- Advertisement -

భర్తను వదిలేసి నిర్మాతతో ఎఫైర్..

అయినా సరే తనకలను విడిచిపెట్టకుండా.. 1967లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. సునీల్, శశికపూర్ , రాజ్ కుమార్ వంటి హీరోలతో పని చేసింది.. అయితే కొన్ని కారణాలవల్ల బిఆర్ చోప్రా కొన్ని సినిమాలకు సంతకం చేయమని చెప్పడంతో, ఆమె బిజీ షెడ్యూల్ వల్ల ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం వచ్చి ఆమెకు అవకాశాలు లేకుండా చేశాడు. అయితే కొంతమంది ఈమె అందానికి, నటనకు మోహితులై అవకాశాలు ఇచ్చినా.. వరుస ఫ్లాప్ లు కావడంతో నిర్మాతలు ఈమెను తీసుకోవడం మానేశారు. అప్పటికే మద్యానికి బానిసైనా ఈమె భర్త డబ్బు కోసం చిన్న నిర్మాలతో సినిమాలు చేయమని హింసించే వాడట. ఇక ఆ తర్వాత ఆ టార్చర్ భరించలేక భర్త నుంచి దూరం అయింది. అదే సమయంలో నిర్మాత జాలీతో ప్రేమలో పడి , అతడితో జీవించడం మొదలు పెట్టింది.

మద్యానికి బానిసై 33 ఏళ్లకే మరణం..

కొద్ది రోజుల తర్వాత జాలీ విమిని మద్యానికి బానిస చేసి, ఆమెను వ్యభిచారం వైపు నెట్టేసాడు. దీంతో ఆమె కేరియర్ నాశనమైంది . 33 ఏళ్లలోనే లివర్ పూర్తిగా పాడైపోయి చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక, ఆస్పత్రిలో జనరల్ వార్డులో చికిత్స పొందుతూ మరణించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు