Jr NTR : తమ్ముడికి ‘దేవర’ స్పెషల్ విషెస్.. సినీ ప్రపంచంలోకి స్వాగతం చెప్తూ..!

Jr NTR: టాలీవుడ్ లో చాలా రోజులుగా నందమూరి వారసుడు, నటసింహం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఇయర్ లోనే ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది దర్శకనిర్మాతలు లాంచింగ్ చేద్దామని ట్రై చేయగా, ఫైనల్ గా ఆ అవకాశం హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతికి వెళ్ళింది. ఇక రెండు రోజుల క్రితమే అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేయగా, తాజాగా నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆ ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ ఆఫ్ లైన్ లో కొన్ని నెలల కింద కనిపించినదానికంటే, స్లిమ్ గా తయారయ్యాడు. ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ స్టైలిష్ గా ఉండగా, నాలుగు నెలల కిందే లావుగా కనిపించిన మోక్షజ్ఞ సినిమాకోసం బాగానే వెయిట్ లాస్ అయ్యాడని తెలుస్తూనే ఉంది. పైగా లైట్ గా గడ్డం కూడా పెంచి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా తమ్ముడు మోక్షజ్ఞకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలపడం జరిగింది.

Jr NTR special birthday wishes to Nandamuri Mokshagna

తమ్ముడికి దేవర స్పెషల్ విషెస్…

ఇక ఊహించని విధంగా నందమూరి మోక్షజ్ఞ (Nandamoori Mokshagna) కి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి ఆహ్వానించాడు. తాజాగా సోషల్ మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞని విష్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు… “నువ్వు సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ అవుతున్నందున శుభాకాంక్షలు మోక్షు.. నువ్వు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందున ‘తాత’ గారితో పాటు అన్ని దేవతల ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది.. “హ్యాపీ బర్త్ డే మోక్షు”… అంటూ ఎన్టీఆర్ విష్ చేస్తూ ట్వీట్ వేసాడు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మోక్షజ్ఞ కి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియచేసాడు. ఇక ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.

- Advertisement -

కొడుకుకోసమైనా బాలయ్య తగ్గుతాడా?

అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గా మోక్షజ్ఞ కు విష్ చేయడంతో నందమూరి అభిమానులు సంతోషిస్తున్నారు. ఎందుకంటే గత కొంత కాలంగా బాలయ్య (Balakrishna) – ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. రీసెంట్ గా బాలకృష్ణ NBK50 ఇయర్స్ ఈవెంట్ కి తారక్ లేకపోవడంతో మరోసారి బహిర్గతమైంది. ఈ క్రమంలో తమ్ముడు మోక్షజ్ఞ కోసం తారక్ స్పెషల్ విష్ చేయడంతో బాలయ్య, ఇప్పుడైనా కొడుకు కోసం తగ్గుతాడా? అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కి జూనియర్ ఎన్టీఆర్ న గెస్ట్ గా పిలిస్తే..అదే సినిమాకి బిగ్గెస్ట్ ప్రమోషన్ అవుతుందని కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ వారు అలాగే మోక్షజ్ఞ సోదరి నందమూరి తేజస్విని కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రశాంత వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా ఉండనుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు