Devara : తెలుగు రాష్ట్రాల్లో దేవర ప్రీమియర్ షోస్ లిస్ట్ .. మోత మోగిపోవాల్సిందే..

Devara : గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ RRR సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు. ఆ సినిమాతో ఎవరితో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాపై తారక్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. త్రిపుల్ ఆర్ తర్వాత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ మూవీ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీమియర్ షోల లిస్ట్ వచ్చేసింది.. ఎక్కడ ఎన్ని షోలు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మూవీ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు నాగ వంశీ. ఓవర్సీస్ తో ఒకేసారి ఏపీ/తెలంగాణలో షోస్ ఒకే టైమ్ కి వేసేలా పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు.. ఈ ప్రీమియర్ షోలు ఎక్కువగా తూర్పు గోదావరిలో పడనున్నాయని సమాచారం.

Devara premiere shows list in Telugu states
Devara premiere shows list in Telugu states

తూర్పు గోదావరిలో ఎక్కడ షోలు పడుతున్నాయంటే?

కాకినాడ పద్మప్రియ, రాజమండ్రిలోని గీతా అప్సర, అమలాపురం రమా టాకీస్, మండపేట రాజారత్నలో ప్రీమియర్స్ కు అన్ని ఏర్పాట్లు చేసారు. ఎన్టీఆర్ జిల్లాలో ట్రెండ్ సెట్, అలంకార్, శైలజ థియేటర్స్ లో తల్లవారు జామున షోస్ ప్లానింగ్ చేశారు. గుంటూరు రీజియన్ లో ఒంగోలులో గోపి కృష్ణ, గోరంట్ల కంప్లెక్స్, సత్యంలో భారీ గా స్పెషల్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. నెల్లూరు రీజియన్ లో కందుకూరు, దర్శి, కనిగిరి, నెల్లూరు టౌన్ లో తెల్లవారి జామున షోస్ అగ్రిమెంట్స్ చేసారు. ఉత్తరాంధ్రలోని వైజాగ్ లో రికార్డు స్థాయి ప్రీమియర్స్ కు థియేటర్స్ లిస్ట్ రెడీ చేస్తున్నారు. నందమూరి కంచుకోట సీడెడ్ లో డే -1 గత చిత్రాల రికార్డ్స్ బద్దలు కొట్టేలా ఉంది సినిమా..

- Advertisement -

ఇక నైజాంలో ప్రీమీయర్ షోలు..

సుదర్శన్ 35, భ్రమరాంబమల్లికార్జున, విశ్వనాధ్, శ్రీరాములు, విమల్ థియేటర్స్ లో షోలు పడనున్నాయని సమాచారం.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు