Amitabh Bachchan.. ఇండియన్ సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) .. ఏడుపదుల వయసు దాటినా సరే ఇప్పటికీ యాక్షన్ సన్నివేశాలలో నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్ గా ఈయన నటించిన కల్కి 2898AD సినిమాలో అశ్వద్ధామ గా నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లో ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఒకవైపు సినిమాలు , మరొకవైపు టీవీ యాడ్స్ అలాగే షోలలో పనిచేస్తూ.. భారీ పాపులారిటీతో పాటు అంతకుమించి వేలకోట్ల రూపాయలను సంపాదించారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన, తన ఆస్తులపై క్లారిటీ ఇస్తూ మరణాంతరం తన ఆస్తులన్నీ కూడా వారికే చెందుతాయి అంటూ తెలిపారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆస్తి పంపకం పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్..
బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి వేల కోట్లకు అధిపతి అయ్యారు అమితాబ్ బచ్చన్. ఈయన భార్య ప్రముఖ నటి జయాబచ్చన్ కాగా, కొడుకు ప్రముఖ హీరో అభిషేక్ బచ్చన్ , అలాగే కోడలు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ అని అందరికీ తెలిసిందే. అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యారాయ్ జంటకు ఆరాధ్య అనే కూతురు కూడా జన్మించింది. సాధారణంగా ఇంట్లో పెద్దవారు మరణిస్తే వారి ఆస్తులు వారి వారసులకు చెందుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమితాబ్ బచ్చన్ ఆస్తులు అభిషేక్ బచ్చన్ తర్వాత ఆరాధ్యకు దక్కుతాయని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ విషయంపై అమితాబ్ బచ్చన్ ను అడగగా.. తన మరణం తర్వాత తన ఆస్తిని ఎవరికి పంచుతాను అనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఆస్తిలో సమాన హక్కు..
ఈ మేరకు అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి మొత్తం నా కుమార్తె , నా కొడుకుకి సమానంగా పంచుతాను. ఇద్దరి విషయంలో ఎటువంటి భేదం లేదు. నేను, జయ చాలా కాలం క్రితమే ఈ విషయంపై నిర్ణయించుకున్నాము అంటూ ఆయన తెలిపారు. ఆడపిల్ల పరాయిది అంటారు.. పెళ్లి అయిన తర్వాత పుట్టింటి ఆస్తితో సంబంధాలు ఉండవు అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు. నిజానికి నా దృష్టిలో ఎప్పటికీ నా కుమార్తె.. ఆస్తి విషయంలో అభిషేక్ కి ఉన్న హక్కులే నా కూతురికి కూడా ఉంటాయి అంటూ సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించారు.
అమితాబ్ బచ్చన్ ఆస్తి విలువ..
ఇకపోతే అమితాబ్ బచ్చన్ ఆస్తి విలువ ఎంత అనే విషయానికొస్తే.. ఈయన ఆస్తి విలువ రూ .1600 కోట్లకు పైగా ఉంటుంది. ఆస్తులు విలువ అంతకంతకు పెరుగుతూనే ఉంది. అందులో భాగంగానే ఇద్దరికీ సరి సమానంగా పంచుతానని క్లారిటీ ఇచ్చారు అమితాబ్ బచ్చన్. ఏది ఏమైనా కూతురు , కొడుకు విషయంలో సమాన హక్కు గురించి ఆలోచించి అందరిని ఆశ్చర్యపరిచారు బిగ్ బీ. ఇకపోతే ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కౌన్ బనేగా కరోడ్పతి షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తో భారీగా సంపాదిస్తున్నారు.