Star Jodi: ఈ జోడీకి యమ క్రేజ్ గురూ..ఏకంగా 130 సినిమాలలో అవకాశం..!

Star Jodi.. సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమాలో హీరో, హీరోయిన్ నటించి, వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరి, ఆ సినిమా సక్సెస్ సాధించింది అంటే మరొకసారి ఆ కాంబినేషన్ లోనే సినిమా తెరకెక్కించే ప్రయత్నం చేస్తారు నిర్వాహకులు. అలా ఒకే జోడీ రెండు మూడు సినిమాలలో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రెండు , మూడు లేదా నాలుగు.. మహా అయితే 5 సినిమాలు ఒకే కానీ అంతకుమించి అదే కాంబినేషన్లో సినిమాలంటే చూసే ఆడియన్స్ కథ అటు పక్కన పెడితే వారితో సినిమా చేయాలంటే డైరెక్టర్ కి కూడా బోర్ కొడుతుంది. కొత్త కాంబినేషన్ అయితే బాగుంటుందని , కొత్త వారిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఒక జోడీ మధ్య కెమిస్ట్రీ కుదరకపోయినా లేదా ఆ జోడీ ఫెయిల్ అయినా సరే ఆ కాంబినేషన్ మళ్ళీ కనిపించదు.

Star Jodi: Too craze for this pair..A chance in 130 movies together..!
Star Jodi: Too craze for this pair..A chance in 130 movies together..!

ఏకంగా 130 సినిమాలలో కలిసి నటించిన జోడి..

అయితే ఒక హీరో, హీరోయిన్ మాత్రం ఏకంగా 130 సినిమాలలో నటించారంటే ఎవరైనా నమ్మగలరా.. ఎవరైనా వింటే అంత లేదులే అంటూ కామెంట్ చేస్తారు నిజం చెప్పాలంటే ఒకటి కాదు.. రెండు కాదు.. 20 కాదు.. 30 కాదు ఏకంగా 130 సినిమాలలో ఒక హీరోయిన్, హీరో కలిసి నటించారు. అప్పట్లో ఈ జోడీకి అంత క్రేజ్ ఉండేది. మరి అయితే ఎవరా జోడి అని ఆలోచిస్తున్నారా.. వారు ఎవరో కాదు మలయాళ నటులు ప్రేమ్ నజీర్ (PremNazeer) – షీలా ,(Sheela)..ఈ జంట ఏకంగా 130 సినిమాలలో నటించారు. 1962ను మొదలుకొని 1981 మధ్య కాలంలో జరిగిన సంఘటన ఇది. ఆ తర్వాత మళ్లీ ఇలా ఇన్ని సినిమాలలో మరే జోడి కూడా కలిసి నటించలేదు. కనీసం ఒక జోడి ఐదు చిత్రాలలో కూడా కలిసిన నటించిన దాఖలాలు లేవు.

అందులో 50 చిత్రాలు బ్లాక్ బస్టర్..

ముఖ్యంగా వీరు నటించిన 130 చిత్రాలలో ఏకంగా 50 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. మరికొన్ని హిట్టు, ఇంకొన్ని యావరేజ్ , ఇంకొన్ని బిలో యావరేజ్ అంతేకాదు ఫ్లాప్ గా నిలిచిన చిత్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో ఈ రేంజ్ లో ఒక జంట నటించడం ఇదే తొలిసారి . ఈ రకంగా భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ రికార్డుల్లో కూడా అప్పట్లో సంచలనం క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఒక జంట రెండు మూడు సినిమాలలో కలిసి నటించారు అంటే వారి మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉందనే రూమర్స్ క్రియేట్ చేస్తారు. ఈ భయంతో కూడా సెలబ్రిటీలు కలిసి రెండు మూడు కంటే ఎక్కువ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. కానీ మలయాళ జంట మాత్రం ఏకంగా 130 చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు అంటే ఇక వారి జంటకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా నిజంగా ఈ జంటను ప్రశంసించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు