Balakrishna : నందమూరి ‘తేజం’ ఇప్పుటి నుంచి ‘లెజెండ్’… నిర్మాణ రంగంలోకి వారసురాలు..

Balakrishna : నందమూరి కుటుంబంలోని అబ్బాయిలు హీరోలుగా రానిస్తున్నారు. కానీ సినిమాల్లోకి ఒక్క అమ్మాయి కూడా ఎంట్రీ ఇవ్వలేదు. ముఖ్యంగా బాలయ్య కూతుర్లకు సినిమాలకు సంబంధం లేకుండా పెంచారు. హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఇద్దరు కూతుర్లలో ఒక్కరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యలేదు బాలయ్య. ఎప్పుడో ఫ్యామిలి ఫంక్షన్స్ అప్పుడు తప్ప బయట కూతుర్లను చూపించలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు బాలయ్య (Balayya ) కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఏంటి..? నిజమా అనే సందేహం కలుగుతుంది కదూ.. అవును ఆయన చిన్న కూతురు సినిమాల్లోకి రాబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో కోడై కూస్తుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మాములుగా కొందరు హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సొంత బ్యానర్ ఉండాలని అనుకుంటారు. నందమూరి బాలకృష్ణకి ( Balakrishna ) “ఎన్.బి.కె ఫిల్మ్స్”, కళ్యాణ్ రామ్ ( Nandamuri Kalyan Ram ) కి “ఎన్టీఆర్ ఆర్ట్స్”, నందమూరి రామకృష్ణ ( Nandamuri Ramakrishna ) “రామకృష్ణ సినీ స్టూడియోస్”, నందమూరి హరికృష్ణ ( Nandamuri Harikrishna ) కూడా “జానకిరామ్” అనే పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేసారు, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ) కూడా తన కుమారుడి పేరు మీద ఒక బ్యానర్ ను మొదలు పెట్టబోతున్నారానికి సమాచారం..

Balakrishna's younger daughter Tejeswini entered the construction industry
Balakrishna’s younger daughter Tejeswini entered the construction industry

అలాగే నందమూరి తేజస్విని కూడా తన తండ్రి నటించిన లెజెండ్ సినిమా పేరుతో బ్యానర్ ను స్టార్ట్ చేసింది. తొలి సినిమాగా తమ్ముడు మోక్షజ్ఞ డెబ్యూ ఇస్తున్న సినిమాకి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఈ బ్యానర్ లో భవిష్యత్ లో భారీ సినిమాలు మరియు కాన్సెప్ట్ సినిమాలు తీయాలని కూడా ప్లాన్ చేస్తోంది తేజస్విని(Tejaswini). చెల్లెల్ని స్ఫూర్తిగా తీసుకొని అక్క బ్రాహ్మణి ( Brahmini ) కూడా ఏదైనా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేస్తుందేమో అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే తండ్రి బాలయ్య సినిమా కథల నుండి ప్రొడక్షన్ వరకు అన్నీ విషయాల్లో సైలెంట్ గా ఇన్వాల్వ్ అవుతున్న తేజస్విని ఇప్పుడు డైరెక్ట్ గా ప్రొడక్షన్ లోకి దిగడంతో ఆమె పెద్ద నిర్మాత అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఒక్క హిట్ పడితే ఆమె కేరీర్ ఎక్కడికో వెళ్తుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. చూద్దాం ఎలాంటి సినిమాలను నిర్మిస్తుందో…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు